భగీరథ మహర్షి అందరివాడు

ABN , First Publish Date - 2023-04-27T23:34:39+05:30 IST

న కఠోర తపస్సుతో గంగను దివి నుంచి భువికి తీసుకువచ్చిన భగీరథుడు అందరివాడని సగర సంఘం జిల్లా అధ్యక్షుడు, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌ చందర్‌ అన్నారు.

భగీరథ మహర్షి అందరివాడు
భగీరథ మహర్షి జయంత్యుత్సవంలో నాయకులు

- సగర సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌ చందర్‌

- ఘనంగా భగీరథ మహర్షి జయంతి

మహబూబ్‌నగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 27 : తన కఠోర తపస్సుతో గంగను దివి నుంచి భువికి తీసుకువచ్చిన భగీరథుడు అందరివాడని సగర సంఘం జిల్లా అధ్యక్షుడు, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌ చందర్‌ అన్నారు. వైశాఖ శుద్ధ సప్తమిని పురస్కరించుకుని గురువారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకల కు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భగీరథ మహర్షి విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ భగీరథ మహర్షి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, జిల్లా మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ బీసీలో ఉన్న అన్ని కులాలకు అందిం చినట్లుగానే సగరులకు సైతం సంక్షేమ పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 59వ జీవోను పునఃపరిశీలించి తు.చ. తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈఎంఐ, టెండర్లు లేకుండానే సగరులకు రూ. 50 లక్షల వరకు కాంట్రాక్టు పనులు ఇవ్వాలని కోరారు. సగరులకు రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు జిల్లా కేంద్రంలో నగర విద్యార్థులు చదువుకునేందుకు ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు మూసాపేట జడ్పీటీసీ సభ్యుడు ఇంద్రయ్య సాగర్‌, సగర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ సమావేశానికి జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇందిర అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సగర సంఘం సభ్యులు ప్రేమ్‌ సాగర్‌, మహిళ అధ్యక్షురాలు పద్మావతి, సర్పంచుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, రవి, సత్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సగర సంగం గౌరవ అధ్యక్షులు సి.జి గోవర్ధన్‌సగర, బుడ్డన్న సగర పాల్గొన్నారు.

అడ్డాకులలో...

అడ్డాకుల : మండలంలో గురువారం భగీరథ మహాముని జయంతి వేడు కలను సగరులు, గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో భగీరథుని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో బుచ్చన్న, రవి సాగర్‌, మేస్ర్తీ బాబు, కృష్ణయ్య, శాంతన్న, జగదీశ్‌, ఆంజనేయులు, చెన్నసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.్

Updated Date - 2023-04-27T23:34:39+05:30 IST