ఆపద మొక్కుల వాడు బీచుపల్లి ఆంజనేయుడు

ABN , First Publish Date - 2023-05-02T23:45:10+05:30 IST

దక్షిణ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన నడిగడ్డలో వెలసిన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా మే నెలలో వైభవంగా జరుగుతాయి.

 ఆపద మొక్కుల వాడు బీచుపల్లి ఆంజనేయుడు

- నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఇటిక్యాల, మే 2 : దక్షిణ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన నడిగడ్డలో వెలసిన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా మే నెలలో వైభవంగా జరుగుతాయి. బీచుపల్లి పుణ్యక్షేత్రం 44వ నంబరు జాతీయ రహదారికి అతి సమీపంలో ఉత్తర వాహినీ అయిన కృష్ణానది ఒడ్డున ఉండటంతో బ్రహ్మోత్సవాలు ఐదురోజుల పాటు, జా తర నెలరోజుల పాటు జరుగుతోంది. బీచుపల్లి పుణ్యక్షేత్రంలో ఆంజనేయస్వామి ఆలయంతో పాటు కోదండరామస్వామి, జ్ఞాన సరస్వతీ, శివాలయాలు ఉండటంతో నిత్యం భక్తులతో సందడి నెలకొంటుంది. కృష్ణానది ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు ప్రవ హిస్తుండడంతో ఉత్తర వాహినీ అని, అపర మంత్రాలయంగా ప్రసిద్ధి గాంచింది. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున స్వామి వారి రథోత్సవాన్ని అశేష భక్తజనం మధ్య నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చి బీచుపల్లి రాయుడికి మొక్కులు తీర్చుకుంటారు.

5న రాత్రి రథోత్సవం

బుధవారం ఉదయం ఆంజనేయస్వామి ఆలయం లో పంచామృతాభిషేకం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహ ణం, బలిహరణం, రాత్రికి తెప్పోత్సవం, 4న ఉదయం పంచామృతాభిషేకం, స్వామివారికి ఉపనయనం, రాత్రికి ప్రభోత్సవం, 5న వైశాఖ శుద్ధ పౌర్ణమి శుక్రవా రం ఉదయం పంచామృతాభిషేకం, వ్యాసపూజ, సీతా రామ కల్యాణం, బలిహరణం, రథాంగ హోమం, రాత్రికి స్వామి వారి రథోత్సవం , 6న శనివారం పంచామృతాభిషేకం, చౌకీసేవ, బలిహరణం, రాత్రికి ప్రభోత్సవం, 7న అమృతస్నాపనం, పంచామృతాభి షేకం, పల్లకీసేవ కార్యక్రమాలు, అవభృతస్నానం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2023-05-02T23:45:10+05:30 IST