చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ABN , First Publish Date - 2023-05-02T22:52:12+05:30 IST
చట్టాలపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచు కోవాలని అడిషనల్ ఎస్పీ సీహెచ్.రామేశ్వర్ పేర్కొన్నారు.
- ఏఎస్పీ రామేశ్వర్
నాగర్‌కర్నూల్ క్రైం, మే 2 : చట్టాలపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచు కోవాలని అడిషనల్ ఎస్పీ సీహెచ్.రామేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్, వేధింపులు, చట్టాలపై ఏఎస్పీ మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో మహిళా ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్క ర్లు మహిళలపై జరుగుతున్న అన్యాయాలను, వేధింపులను ఎలా ఎదుర్కో వాల్లో గ్రామాల్లో ఉంటున్న మహిళలకు, విద్యార్థులకు షీ టీమ్ సభ్యులు తెలి యజేయాలన్నారు. అపరిచిత వ్యక్తులు, పరిచయస్తులు, సామాజిక మాధ్య మాల్లో మేసేజ్‌లు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తే నిర్భయంగా డయల్ 100కు లేదా షీ టీమ్ నెంబరు 8712657676కు ఫోన్ చేసి సహాయం పొందాల న్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రమాదేవి, వైస్ ప్రిన్సిపాల్ భరత్ కుమార్‌రెడ్డి, డాక్టర్ గౌస్, ఏడీ డాక్టర్ రంజిత్‌కుమార్, డాక్టర్ అరుణ్,ప్రకాశ్, డాక్టర్ వాణి, ఎస్సై విజయ్‌కుమార్, షీటీమ్ ఇన్‌చార్జి విజయలక్ష్మి, మోయిన్, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, చిన్నా పాల్గొన్నారు.