ఎస్‌బీఐలో చోరీకి యత్నం
ABN , First Publish Date - 2023-12-04T23:14:17+05:30 IST
బ్యాంక్‌లకు వచ్చిన వారి నుంచి డబ్బులు చోరీ చేస్తున్న మహిళలను నిఘా ఉంచి అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన కొందరు మహిళలు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసేవారిని టార్గెట్ చేసి, వారి నుంచి డబ్బులను దొంగిలిస్తున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ముగ్గురు మహిళల అరెస్ట్
గద్వాల క్రైం, డిసెంబరు 4: బ్యాంక్‌లకు వచ్చిన వారి నుంచి డబ్బులు చోరీ చేస్తున్న మహిళలను నిఘా ఉంచి అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన కొందరు మహిళలు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసేవారిని టార్గెట్ చేసి, వారి నుంచి డబ్బులను దొంగిలిస్తున్నారు. ఆ క్రమంలోనే సోమవారం గద్వాల పట్టణంలోని పోస్టాఫీసు సమీపంలో గల ఎస్‌బీఐలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర వైన్స్ దుకాణానికి సంబంధించిన రూ.5.76 లక్షలు డిపాజిట్ చేసేందుకు సిబ్బంది నవీన్ వచ్చారు. దాంతో మధ్యప్రదేశ్‌కు చెందిన యువతులు హీనా, సునేనా ఆ వ్యక్తి బ్యాగ్ నుంచి రూ.2 లక్షలు కాజేసి పారిపోతుండగా.. బ్యాంక్ సెక్యూరిటీ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఇద్దరు యువతులు దొంగిలించిన డబ్బులను ఇచ్చేందుకు వారి అమ్మ బీనాబాయ్‌ని బ్యాంక్ బయటే ఉంచడం గమనార్హం. సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు. బ్యాంకు లావాదేవీల విషయంలో అప్రమ్తంగా ఉండాలని ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.