ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-09-26T22:57:00+05:30 IST
కనీస వేతనం అమలు చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశ కార్యకర్తలు పేట పుర పార్కు ముందు చేపట్టిన సమ్మె మంగళవారం రెండో రోజు కొనసాగింది.
నారాయణపేట, సెప్టెంబరు 26 : కనీస వేతనం అమలు చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశ కార్యకర్తలు పేట పుర పార్కు ముందు చేపట్టిన సమ్మె మంగళవారం రెండో రోజు కొనసాగింది. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదన్నారు. ఆశవర్కర్ల సంఘం నాయకులు బాలమణి, నాగమణి, జయలక్ష్మి, రాధిక పాల్గొన్నారు.
మక్తల్ : ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మక్తల్ ఎంపీడీవో కార్యాలయం ముందు ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా నాయకులు గోవిందరాజు, ఆంజనేయులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశ వర్కర్లకు రూ.18 వేల వేతనం చెల్లించాలన్నారు. ఆశ కార్యకర్తల యూనియన్ మండల అధ్యక్షురాలు స్వప్న, ఉపాధ్యక్షురాలు అమీనా బేగం, ప్రధాన కార్యదర్శి ఇందిరా, సహాయ కార్యదర్శి యశోద, కోశాధికారి గోవిందమ్మ, సుజాత, రేణుక, పద్మ, జ్యోతి, పార్వతమ్మ, గౌరీ, గంగమ్మ, రషీదా బేగం, రాధిక, పుష్పలత, సుజాత, బాలమ్మ, రామేశ్వరీ, తిరుపతమ్మ, లక్ష్మి, వెంకటమ్మ, శశిరేఖ, నర్సమ్మ పాల్గొన్నారు.