Share News

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2023-12-02T22:57:14+05:30 IST

శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అవరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జి. రవినాయక్‌ తెలిపారు.

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ జి. రవినాయక్‌

- కౌంటింగ్‌ సిబ్బంది శిక్షణలో కలెక్టర్‌ జి.రవినాయక్‌

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), డిసెంబరు 2 : శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అవరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జి. రవినాయక్‌ తెలిపారు. కౌంటింగ్‌ విధులకు నియమించిన సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని జిల్లా అధికారుల కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో కౌంటింగ్‌ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి దేవరకద్ర నియోజకవర్గం ఓట్ల లెక్కింపు పరిశీలకురాలు జి. రశ్మి, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు పరిశీలకులు రఘురాం అయ్యర్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గనిర్ధేశం ప్రకారం సిబ్బంధి పని చేయాలని, ముఖ్యంగా కౌంటింగ్‌పై జారీ చేసిన సూచనలు అన్నింటిని తు.చ. తప్పకుండా పాటించాలని తెలిపారు. ఏ టేబుల్‌లో ఏ పోలింగ్‌ కేంద్రం కౌంటింగ్‌ వస్తుందో అన్ని విషయాలను ముందే తెలియజేశామని, ఇవన్ని ఫ్లెక్సీలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా గుర్తింపు కార్డును ధరించి ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లాలని అన్నారు. కౌంటింగ్‌ తర్వాత చేపట్టవలసిన కార్యక్రమాలు, ట్యాబిలేషన్‌కి అవసరమైన కంప్యూటర్‌ సిబ్బంది నియామకం, డేటా ఎంట్రీలో ఇబ్బందులు లేకుండా పనిచేయాలని ఆదేశిం చారు. ఓట్ల లెక్కింపుకై నియమితులైన దేవరకద్ర నియోజకవర్గ లెక్కింపు పరిశీలకులు జి.రశ్మి, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు పరిశీల కులు రఘురామ్‌ అయ్యర్‌ ఓట్ల లెక్కింపుపై పలు సూచనలు చేశారు, మహ బూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్టాల రిటర్నింగ్‌ అధికారులు అనిల్‌ కుమార్‌, ఎస్‌.మోహన్‌ రావు, ఎన్‌. నటరాజ్‌, డీఎఫ్‌ఓ సత్యనారాయణ, ట్రైనింగ్‌ నోడల్‌ అధికారి, డీఈఓ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా మహబూబ్‌ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 7 టేబుళ్లు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఏర్పాటు చేస్తున్నామని, సుమారు 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుందని ఒక టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, ఒక అసిస్టెంట్‌, ఒక మేక్రో అబ్జర్వర్‌ ఉంటారని మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి అనిల్‌కుమార్‌ తెలిపారు. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబం ధించి 14 టేబుల్లు ఏర్పాటు చేయగా, 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగ నుందని, 274 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఒక అసిస్టెంట్‌, ఓక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారని, పోస్టల్‌ బ్యాలెట్‌కు 2 టేబుల్స్‌ ఏర్పాటు చేశామని, జడ్చర్ల ఆర్‌ఓ ఎస్‌. మోహన్‌రావు తెలిపారు. అలాగే దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి 21 రౌండ్లలో లెక్కింపు జరగ నుండగా, 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని, 289 పోలింగ్‌ కేంద్రాలు ఈ నియోజ కవర్గంలో ఉండగా, ఒక సూపర్‌వైజర్‌, ఒక అసిస్టెంట్‌, ఒక మైక్రోఅబ్జర్వర్‌ ఉంటారని రిటర్నింగ్‌ అధికారి నటరాజ్‌ తెలిపారు.

Updated Date - 2023-12-02T22:57:15+05:30 IST