ప్రభుత్వ ఆసుపత్రిలో 11 గంటలైనా వైద్యులేరీ?

ABN , First Publish Date - 2023-03-30T23:41:49+05:30 IST

వంద పడకల హాస్పిటల్‌లో చికిత్స కోసం సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వస్తే ఇక్కడ మాత్రం ఉదయం 10:45నిమిషాలైనా ఒక్క డాక్టర్‌ రాలేదని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

 ప్రభుత్వ ఆసుపత్రిలో 11 గంటలైనా వైద్యులేరీ?
సివిల్‌ ఆసుపత్రిలో రోగులతో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ

- డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేట టౌన్‌, మార్చి 30: వంద పడకల హాస్పిటల్‌లో చికిత్స కోసం సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వస్తే ఇక్కడ మాత్రం ఉదయం 10:45నిమిషాలైనా ఒక్క డాక్టర్‌ రాలేదని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిని పరిశీలించి, రోగులను సమస్యలు అడిగి తెలసుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి దా దాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ 100పడకల ఆసుపత్రి ఉందని వస్తున్న రోగులు డాక్టర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అచ్చంపేట పట్టణంలో పేద ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న 100పడకల హాస్పిటల్‌ పూర్తయి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఎందుకు ప్రారంభానికి నోచుకోవడంలేదని ప్రశ్నించారు. 100 పడకల ఆసుపత్రిని 2013లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నేను ప్రతిపా దనలు పంపి మంజూరు చేయించానన్నారు. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యం అందించాల్సిన డాక్టర్లు ఎలాంటి కనికరం లేకుండా రోగులను త మ ప్రైవేటు ఆసుపత్రులకు పంపించుకొని వైద్యం చేస్తున్నారని ఆరోపిం చారు. నేను ఒక డాక్టర్‌ అయినందువల్ల నాతోటి డాక్టర్లను నేను ఎప్పుడు విమర్శించిన దాఖలాలు లేవు.. కాకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో మీకు కేటా యించేటువంటి సమయంలో వచ్చి ప్రజలకు వైద్యం అందించాలని.. అది డాక్టర్‌గా వృత్తి ధర్మమన్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇప్పుడు నడుస్తున్న ఆసుపత్రి, మాతాశిశు కేంద్రం, బ్లడ్‌ బ్యాంక్‌ వంటి వసతులు నేను ఏర్పాటు చేసినవేనన్నారు. ఈ ఎమ్మెల్యే వచ్చాక ఏమి చేశారో సమాధానం చెప్పాలన్నారు. మూడు రోజుల్లో అచ్చంపేట ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో సరైన సిబ్బంది, మందుల కొరత వంటివి పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున్న ధర్నా చేస్తామని పిలుపునిచ్చారు. నాయకులు శ్రీనివాసులు, చంద్రమౌళి, అంతటి మల్లేష్‌, ఆనందర్‌, గణేష్‌, ఖాదర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T23:41:49+05:30 IST