ప్రశ్నపత్రాల లీక్‌పై విచారణ జరిపించాలి

ABN , First Publish Date - 2023-03-18T23:11:12+05:30 IST

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకే కుంభకోణంపై సిట్టింగ్‌ జడ్జీ చేత విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు బీ కృష్ణ, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి డి మాండ్‌ చేశారు.

ప్రశ్నపత్రాల లీక్‌పై విచారణ జరిపించాలి

వనపర్తి అర్బన్‌, మార్చి 18: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకే కుంభకోణంపై సిట్టింగ్‌ జడ్జీ చేత విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు బీ కృష్ణ, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి డి మాండ్‌ చేశారు. శనివారం బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఏవోకి వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడం తప్పుడు చర్య అని అన్నారు. నయీం కేసు, డ్రగ్స్‌ కేసు, డేటా చోరీ సహా సిట్‌కు అప్పగించిన కేసులన్నీ నీరుగారి పో యావని అన్నారు. ఈ అంశంపై సిట్టింగ్‌ జడ్జీతో న్యాయవిచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు లోకి వస్తాయని అన్నారు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై స్పందించాల్సిన సీఎం నోరు ఎందుకు మెదపడం లేదని, తన కుమారుడి నిర్వాకం వల్లే పేపర్‌ లీక్‌ అయ్యింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలో చెలగాటమాడ తారా అని మండిపడ్డారు. ప్రశ్నపత్రాలు లీకేజీపై న్యాయవిచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరసన దీక్ష చేస్తే పోలీసులు అరెస్టు చేయడం, టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడించిన బీజేవైఎం కార్యకర్తల పై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి జైలుకు పం పించడం అన్యాయమన్నారు. నిరుద్యోగుల తరపు న పోరాడుతున్న యువమోర్చా కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బీ శ్రీశైలం, జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు, యువమోర్చా అధ్యక్షుడు అనుజ్ఞరెడ్డి, పట్టణ అధ్యక్షుడు బోయెల్ల రాము, ప్రధాన కార్యదర్శి సూగురు రాములు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:11:12+05:30 IST