ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2023-06-26T23:13:54+05:30 IST
పట్టణంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సోమవారం అయిజలో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.
- అయిజలో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో
- అరెస్ట్ చేసిన పోలీసులు
అయిజ, జూన్ 26 : పట్టణంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సోమవారం అయిజలో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. పెద్ద వాగుపై వంతెన నిర్మాణం చేపడుతున్నారు. అందుకోసం ప్రత్యామ్నయ మార్గాలను అందుబాటు లోకి తేకుండానే పాత వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు సోమవారం పాత బస్టాండు వద్ద రాస్తారోకో చేపట్టారు. దీంతో దారికి అటూ, ఇటూ వాహనాలు అధిక సంఖ్యలో నిలిచి పోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. ఆందోళనలో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి షెక్షావలిఆచారి, జిల్లా అధికార ప్రతినిధి మైనర్‌బాబు, ఎస్‌సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, పట్టణ అధ్యక్షుడు అడ్వకేట్ మదు, జనరల్ సెక్రటరీ సాంబశివుడు, నాయకులు బసవరాజు, దేవేంద్ర, శాలి, ఫిరోజ్, అబ్రహాము, రవీంద్ర, లాల్‌గౌడు తదితరులు పాల్గొన్నారు.