రుణాల మంజూరులో జాప్యం చేస్తే చర్యలు

ABN , First Publish Date - 2023-09-21T23:05:02+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష పంట రుణాలను మా ఫీ చేయడం జరిగిందని, అర్హత ఉన్న రైతులకు వెంటనే కొత్త రుణాలు అందించాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ బ్యాంకు అధికారులను ఆదేశించారు.

రుణాల మంజూరులో జాప్యం చేస్తే చర్యలు
ఎస్‌బీఐలో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

- కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, సెప్టెంబరు 21 : రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష పంట రుణాలను మా ఫీ చేయడం జరిగిందని, అర్హత ఉన్న రైతులకు వెంటనే కొత్త రుణాలు అందించాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ బ్యాంకు అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకును గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్లతో పంట రుణాలకు సంబం ధించిన మొత్తం రైతుల వివరాలు, మాఫీ కాబడిన రైతుల జాబితాను పరిశీలించారు. రెన్యువల్‌ చేయబడిన పంట రుణాల వివరాలపై సమీక్షించారు. వనపర్తి అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ బ్యాం కులో 1269 ఖాతాల్లో రూ.9 కోట్ల 86 లక్షలు రుణమాఫీ కింద బ్యాంకుకు అందాయని, వీటిలో 899 మంది రైతుల ఖాతాలను రెన్యువల్‌ చేశామని బ్యాంకు అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం ఎస్‌బీఐలో రుణమాఫీ నిమిత్తం వచ్చిన రైతులతో మాట్లాడి పంట రుణాలకు సం బంధించిన వివరాలనడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం అమోల్‌ పవార్‌ ఉన్నారు.

Updated Date - 2023-09-21T23:05:02+05:30 IST