పింఛన్‌ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-02-21T22:58:37+05:30 IST

మండల కేంద్రంలో ఆసరా పింఛన్ల పంపిణీలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్‌ డిమాండ్‌ చేశారు.

పింఛన్‌ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
మాట్లాడుతున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌

ఊట్కూర్‌, ఫిబ్రవరి 21 : మండల కేంద్రంలో ఆసరా పింఛన్ల పంపిణీలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఊట్కూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో అధికార పార్టీ నాయకులు, ఎంఐఎం నాయకులు పంచాయతీ కార్యదర్శి, పోస్టుసిబ్బంది కుమ్ముకై అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామంలో చనిపోయిన వారి పేరిట ఇప్పటికి వరకు పింఛన్లు తీసుకుంటున్నారని, వాటికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయన్నారు. అధికార పార్టీ నాయకులు వాటాలు పంచుకుని చనిపోయిన వారి పింఛన్‌ పుస్తకాలను తమ వద్ద ఉంచుకుని పంచాయతీ కార్యదర్శి మరియు పోస్టు సిబ్బందితో కలిసి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. కలెక్టర్‌ చొరవ తీసుకుని జిల్లాలో జరుగుతున్న అవినీతిపైన విచారణ చేపట్టాలన్నారు. సమావేశంలో మండలాధ్యక్షుడు రమేష్‌, ఎంపీటీసీ సభ్యుడు హన్మంతు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్‌, వాణిజ్య సెల్‌ అధ్యక్షుడు కృష్ణయ్యగౌడ్‌, ఆశప్ప, కొండన్‌గోపాల్‌, వెంకట్రాములు, రఘువీర్‌, గొల్ల శ్రీకాంత్‌, అమీర్‌, సందీప్‌, ముస్తాక్‌, రణవీర్‌, అనీప్‌, ఎస్‌కే మునీర్‌, జగన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T22:59:00+05:30 IST