లక్ష్మీనర్సింహస్వామికి 1008 కలశాలతో అభిషేకం
ABN , First Publish Date - 2023-02-06T23:48:10+05:30 IST
పాలమూరు పట్టణం లోని కొత్తగంజ్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమ వారం ఉదయం వివిధ పూజా కార్యక్రమాల అనంతరం 1008 కలశాలతో అభిషేకం నిర్వహించారు.

మహబూబ్‌నగర్ (పద్మావతి) కాలనీ, ఫిబ్రవరి 6 : పాలమూరు పట్టణం లోని కొత్తగంజ్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమ వారం ఉదయం వివిధ పూజా కార్యక్రమాల అనంతరం 1008 కలశాలతో అభిషేకం నిర్వహించారు.
జడ్చర్లలో వైభవంగా శకటోత్సవం
బాదేపల్లి, ఫిబ్రవరి 6 : పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శకటోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లను దేవాలయం చుట్టూ తిప్పారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శకటోత్సవం నేత్రపరంగా సాగింది. వివిధ గ్రామాల నుంచి భక్తులు తమ ఎడ్ల బండ్లను అలంకరించుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. అదేవిధంగా ప్రభలు, ట్రాక్టర్లు, ఆటోలు ప్రత్యేక అలంకరణతో సందడి చేశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త భీంసేనచారి, ఈవో రంగాచారి, అర్చకులు సుధీంద్ర, రఘురాజ, రాఘవేం ద్రచారి, ప్రసాద్, వివిధ పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
మద్దిగట్లలో ఘనంగా జక్కబీరప్పస్వామి జాతర
భూత్పూర్, ఫిబ్రవరి 6 : మండంలోని మద్దిగట్ల గ్రామంలో సోమవారం జక్క బీరప్పస్వామి జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పోతురాజుల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. మహిళలు బోనాలతో బయలుదేరగా, కొందరు మహిళలు పూనకంతో ఊగారు. బీరప్పస్వామి దేవాలయ నిర్మాణానికి తనవంతు సహాయంగా ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి రూ.100,000 నగదును యాదవ సంఘం నాయకులకు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు సుదర్శన్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.