గొప్ప పరిపాలనాదక్షుడు
ABN , First Publish Date - 2023-08-22T23:51:27+05:30 IST
గొప్ప పరిపాలనాదక్షుడు రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలో పుట్టడం జిల్లా వాసులకు గర్వకారణమని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాసగౌడ్ అన్నారు.
- రాజాబహదూర్ వెంకట్రామారెడ్డికి ఘన నివాళి
- జయంతి వేడుకల్లో ఆబ్కారీశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్
పాలమూరు, ఆగస్టు 22 : గొప్ప పరిపాలనాదక్షుడు రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలో పుట్టడం జిల్లా వాసులకు గర్వకారణమని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాసగౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గ్రీన్ బెల్టు ఏరియాలో రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి 154వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మన జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని, రెడ్డి హాస్టల్ ద్వారా అనేక మం దిని ప్రయోజకులుగా చేసిన ఘనత ఆయనదన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణా సుధాకర్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పి.గిరిధర్‌రెడ్డి, మల్లు నరసింహారెడ్డి, ఇంద్రసే నారెడ్డి, ధనుంజయరెడ్డి, రాఘవరెడ్డి, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.