వైభవంగా బీరప్ప బండారు మహోత్సవం

ABN , First Publish Date - 2023-04-03T22:46:00+05:30 IST

ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే బీరప్ప మహోత్సవాలను మండలంలోని పెద్దజట్రం గ్రామంలో సోమవారం మాదాసి కుర్వలు వైభవంగా జరుపుకున్నారు.

 వైభవంగా బీరప్ప బండారు మహోత్సవం
బండారు మహోత్సవంలో పసుపు చల్లుకుంటున్న భక్తులు

- వందలాదిగా తరలివచ్చిన భక్తులు

- పసుపుమయమైన ఆలయ ప్రాంగణం

ఊట్కూర్‌, ఏప్రిల్‌ 3 : ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే బీరప్ప మహోత్సవాలను మండలంలోని పెద్దజట్రం గ్రామంలో సోమవారం మాదాసి కుర్వలు వైభవంగా జరుపుకున్నారు. వందలాది భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అంతకుముందు బీరప్ప గుడి వద్ద భక్తులు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నరు. అనంతరం గుడి వద్ద హోమం నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. బీరప్పను ఇంటి దేవుడిగా కొలిచే వారు కుటుంబ సమేతంగా బండారులో పాల్గొన్నారు. బంఽధువులు పసుపు చల్లి ఆశ్వీరదించారు. బండారు మహోత్సవంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవరి మల్లప్ప, జడ్పీటీసీ సభ్యుడు అశోక్‌కుమార్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ విజయసింహారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కిరణ్‌కుమార్‌, సర్పంచ్‌ కతలప్ప, ఉప సర్పంచ్‌ అరుణమ్మ, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్‌ సాయిలు గౌడ్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్వలు ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం సాయంత్రం బీరప్ప స్వామి పల్లకీ సేవ నిర్వహించారు. గ్రామస్థులు రాఘవరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, కుర్వ సంఘం నాయకులు ఎడిగెరి నర్సప్ప, ఎడిగెరి చందు. ఎడిగెరి పోలప్ప, గుడిగెండ్ల రామప్ప, హన్మంతు, బాలప్ప, పూజారి నర్సిములు, లింగప్ప, శ్రీను, కుర్వ బాలప్ప పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T22:46:00+05:30 IST