ఎమ్మెల్యే బండ్లకు శుభాకాంక్షల వెల్లువ
ABN , First Publish Date - 2023-12-05T23:44:53+05:30 IST
గద్వాల నియోజక వర్గ ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి రెండవ సారి గెలుపొందడంతో కార్యకర్తలు, బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం ఆయన ను ఘనంగా సన్మానించారు.
- సన్మానించిన పలువురు నాయకులు
- సవారమ్మ దేవతకు ఎమ్మెల్యే దంపతుల పూజలు
- ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్న కార్యకర్తలు
గద్వాల న్యూటౌన్/ మల్దకల్/ గట్టు/ ధరూరు, డిసెంబరు 5 : గద్వాల నియోజక వర్గ ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి రెండవ సారి గెలుపొందడంతో కార్యకర్తలు, బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం ఆయన ను ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు తెలుపుతూ గజమాల, పూలమాల లు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్. కౌన్సిలర్లు తెలుగు శ్రీనివాసులు, మురళి, నాయకులు, వంటభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే డీఎంహెచ్‌వో డాక్టర్ శశికళ, సిబ్బంది ఎమ్మె ల్యేకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
- గద్వాల ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి రెండవసారి గెలుపొందినందుకు మూడవ వార్డు కౌన్సిలర్ గీతమ్మ, నాయకులు నాగులు యాదవ్ ఆధ్వర్యంలో జమ్ములమ్మకు 101 కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమంలో నాయకులు జయన్న, రాజు పాల్గొన్నారు.
- గట్టు మండల కేంద్రంలోని గండి హనుమప్ప ఆలయంలో మంగళవారం బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 101 కొబ్బరికా యలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. కార్యక్రమంలో బీఅర్‌ఎస్ మండల యూత్ అధ్యక్షుడు గాజుల సంతోష్, కొళాయి భాస్కర్, బజారి, హనుమంతురెడ్డి, ఎస్,రాము పాల్గొన్నారు.
జములమ్మ ఆలయానికి పాదయాత్ర
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి రెండవ సారి విజయం సాధించిన సందర్భంగా మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు చిన్నా మంగళవారం జములమ్మ దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అంతకుముందు ఆయన పాదయాత్రను ఎంపీపీ రాజారెడ్డి, మాజీ ఎంపీపీ సత్యారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గెలిస్తే పాదయాత్ర చేపడతానని మొక్కుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న, మండల అధ్యక్షుడు వెంకటన్న, నాయకులు ఎల్లప్ప, తిమ్మప్ప, ఆశన్న, శ్రీనివాస్‌రెడ్డి, జహీర్, బీసన్న, వెంకటన్న, కృపానందం తదితరులు పాల్గొన్నారు.
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని, పార్టీ ధరూరు మండల అధ్యక్షుడు డీఆర్ విజయ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రం లోని క్యాంపు కార్యాలయంలో ధరూరు మండల నాయ కులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వెంక టేష్‌నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, తిరుమల్‌రెడ్డి, చిరు, వార్డు సభ్యుడు భాస్కర్‌రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు అబ్రహాం, రాములు, దేవన్న, విక్రమసింహారెడ్డి, సత్యన్న, శ్రీనివాసులు, గోవర్ధన్, లాజర్, తిమ్మప్ప, ఈదన్న, మహేష్, రమేష్, తాయన్న, యూత్ మండల ప్రధాన కార్యదర్శి ఎస్.సంజీవ్ పాల్గొన్నారు.
సవారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
మల్దకల్ మండలంలోని దాసరపల్లి సవారమ్మ ఆలయంలో మంగళవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రెండవ సారి విజయం సాధించిన సందర్భంగా 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సర్పంచ్ వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.