ధర్నా చౌక్‌ను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2023-08-10T23:03:45+05:30 IST

ప్రజా సమస్యలపై పోరాడే సంఘాలు, పార్టీలకు వేదిక గా ఉం డేందుకు వీలుగా పట్టణంలో శాశ్వత ధర్నా చౌక్‌ను ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణా రెడ్డిలు కోరారు.

ధర్నా చౌక్‌ను ఏర్పాటు చేయాలి
పట్టణంలో ధర్నా చౌక్‌ స్థలాన్ని పరిశీలిస్తున్న నాయకులు

- పార్టీలు, సంఘాల నాయకుల స్థల పరిశీలన

గద్వాల టౌన్‌, ఆగస్టు 10 : ప్రజా సమస్యలపై పోరాడే సంఘాలు, పార్టీలకు వేదిక గా ఉం డేందుకు వీలుగా పట్టణంలో శాశ్వత ధర్నా చౌక్‌ను ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణా రెడ్డిలు కోరారు. పట్టణంలో వివిధ ప్రజా సంఘాలు, ప్రతి పక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగే ఆందో ళనలకు వేదికగా ఉండే ధర్నా చౌక్‌ కోసం గురువారం వారు స్థలాన్ని పరిశీలించారు. స్థానిక పాతబస్టాండ్‌ సర్కిల్‌, రాజీవ్‌మార్గ్‌, పాత ఎంపీడీవో కార్యాలయం తదితర చోట్ల ధర్నా చౌక్‌ను ఏర్పాటుచేసి, ప్రజా సమస్యలపై పోరాడే వారికి వేదిక కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి ధర్నా చౌక్‌ ఏర్పాటుకు కృషి చేయాలని, ఇందుకు అన్ని సంఘాలు, పార్టీలు సహకరించాలని కోరారు. స్థలాన్ని పరిశీలించిన వారిలో వైఎస్‌ఆర్‌టీపీ, జిల్లా కోఆర్డినేటర్‌ అతిక్‌ఉర్‌రహెమాన్‌, సీపీఐ(ఎం)ఎల్‌ ప్రజాపంథా నాయకుడు గంజపేట రాజు తదితరులున్నారు.

Updated Date - 2023-08-10T23:03:45+05:30 IST