జిల్లా ఆసుపత్రిలో అమానుష ఘటన

ABN , First Publish Date - 2023-01-24T23:11:11+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో అమానుష ఘటన మంగళ వారం చోటు చేసుకుంది. డెలివరీ వార్డులోని బాత్‌రూమ్‌లో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం లభ్యమైంది. దీంతో గర్భిణులు, బాలింతలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సోమవారం ప్రసూతి వార్డుకు 18మంది గర్భిణులు ప్రసవం కోసం రాగా ఎనిమిది మందికి సిజేరియన్లు చేసి డెలివరీ చేశారు. మరో ముగ్గురు గర్భిణులకు సాధారణ ప్రసవం జరిగింది.

జిల్లా ఆసుపత్రిలో అమానుష ఘటన

డెలివరీ వార్డు బాత్‌రూమ్‌లో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం లభ్యం

ఆందోళన చెందుతున్న గర్భిణులు, రోగులు

కందనూలు, జనవరి 24 : నాగర్‌కర్నూల్‌ జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో అమానుష ఘటన మంగళ వారం చోటు చేసుకుంది. డెలివరీ వార్డులోని బాత్‌రూమ్‌లో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం లభ్యమైంది. దీంతో గర్భిణులు, బాలింతలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సోమవారం ప్రసూతి వార్డుకు 18మంది గర్భిణులు ప్రసవం కోసం రాగా ఎనిమిది మందికి సిజేరియన్లు చేసి డెలివరీ చేశారు. మరో ముగ్గురు గర్భిణులకు సాధారణ ప్రసవం జరిగింది. దీంతో పాటు, గర్భిణుల ఆరోగ్య సమస్యల కోసం ఆసుపత్రిలో ఓపీ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రసవం అనంతరం బాలింతలకు ఏర్పాటు చేసే వార్డులోని బాత్‌రూమ్‌లో నీళ్లు వెళ్లే నాలా వద్ద మృతి చెందిన శిశువును కుక్కి యథా విధిగా నాలా మూత బిగించారు. వార్డులోని రోగులు బాత్‌ రూమ్‌కు వెళ్లగా మురుగునీరు వెళ్లకపోవడంతో శానిటైజేషన్‌ సిబ్బందిని పిలిపించారు. సిబ్బంది గమనించే క్రమంలో ఒక్కసారిగా మృత శిశువును చూసి కంగుతిన్నారు. విష యాన్ని ఆసుపత్రి నిర్వాహకులకు తెలుపగా వారు పరిశీలించి ఇదేరోజు గుర్తు తెలియని బాలింత ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి నిర్వహణ, అలసత్వం ఈ ఘటనతో తేటతెల్లమవుతుంది. రోగులు మాత్రం ప్రభుత్వ దవాఖాన అంటేనే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన జిల్లా ఆసుపత్రిలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-01-24T23:11:11+05:30 IST