జోగుళాంబ ఆలయాన్ని అగ్రగామిగా నిలుపుతాం
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:03 PM
: రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ దేవి బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను అగ్రగామిగా తీర్చిదిద్దే బాధ్యతను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
అలంపూర్, డిసెంబరు 17: రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ దేవి బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను అగ్రగామిగా తీర్చిదిద్దే బాధ్యతను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏఐసీసీ జనరల్ కార్యదర్శి సంపత్‌కుమార్, జోగుళాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ ఆదివారం హైదరాబాద్‌లో సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి జోగుళాంబదేవి అమ్మవారి జ్ఞాపికతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు, యాత్రికుల సౌకర్యార్థం చేపట్టాల్సిన వివిధ పనులను సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అలంపూర్ ఆలయాలను కుటుంబ సమేతంగా దర్శించుకుంటామని, దేవాదాయ, పర్యాటక, పురాతత్వశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.