Share News

Liquor shops: 48 గంటలపాటు మద్యం షాపులు బంద్‌

ABN , First Publish Date - 2023-11-29T11:13:08+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఉన్న మద్యం షాపులు, బారులు, కల్లు దుఖాణాలను

Liquor shops: 48 గంటలపాటు మద్యం షాపులు బంద్‌

పేట్‌బషీరాబాద్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఉన్న మద్యం షాపులు, బారులు, కల్లు దుఖాణాలను మంగళవారం కుత్బుల్లాపూర్‌ ఎక్సైజ్‌ సీఐ యాదయ్య బంద్‌ చేయించారు. ఈ దుఖాణాలు 48 గంటల పాటు బంద్‌ ఉంటాయని, ఎవరైనా మద్యం విక్రయిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించినట్లేయితే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ సీఐ హెచ్చరించారు.

Updated Date - 2023-11-29T11:13:09+05:30 IST