Medico Preethi: ప్రీతి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ.. వరంగల్ సీపీకి కీలక ఆదేశం

ABN , First Publish Date - 2023-03-08T19:45:48+05:30 IST

మెడికో ప్రీతి (Medico Preethi) కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ప్రీతి ఘటనలో నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దంటూ వరంగల్ సీపీ రంగనాథ్‌ను కేటీఆర్ ఆదేశించారు.

Medico Preethi: ప్రీతి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ.. వరంగల్ సీపీకి కీలక ఆదేశం

వరంగల్‌: మెడికో ప్రీతి (Medico Preethi) కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ప్రీతి ఘటనలో నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దంటూ వరంగల్ సీపీ రంగనాథ్‌ను కేటీఆర్ ఆదేశించారు. ప్రీతి మృతి ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, ప్రీతి కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. గతంలో ప్రీతి కేసుపై కేటీఆర్ (KTR) స్పందించారు. ప్రీతి ఘటనను రాజకీయం చేస్తున్నారని తప్పుబట్టారు. ప్రీతిని హత్య చేసిన వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు సైఫ్ అయినా సంజయ్ అయినా ఎవరినీ వదలమని కేటీఆర్ హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్‌లోని నిమ్స్‌ (NIMS) ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన ప్రీతి తుదిశ్వాన విడిచిన విషయం తెలిసిందే. డాక్టర్ల బృందం ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ప్రీతి తన సీనియర్‌ ఎంఏ సైఫ్‌ వేధింపులు భరించలేక ఫిబ్రవరి 22న ఉదయం మత్తు ఇంజక్షన్‌ తీసుకుంది.

ప్రీతి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా

ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే పాలకుర్తి నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున రూ.20 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రీతి కుటుంబ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) హామీ ఇచ్చినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని ఎర్రబెల్లి తెలిపారు.

Updated Date - 2023-03-08T20:41:45+05:30 IST