Hyderabad: కొత్తగూడ వంతెన ప్రారంభించనున్న కేటీఆర్

ABN , First Publish Date - 2023-01-01T12:50:21+05:30 IST

నూతన సంవత్సర కానుకగా ఐటీ కారిడార్‌ (IT Corridor)లో అతిపెద్ద వంతెన ఆదివారం అందుబాటులోకి రానుంది.

Hyderabad: కొత్తగూడ వంతెన ప్రారంభించనున్న కేటీఆర్

హైదరాబాద్‌: నూతన సంవత్సర కానుకగా ఐటీ కారిడార్‌ (IT Corridor)లో అతిపెద్ద వంతెన ఆదివారం అందుబాటులోకి రానుంది. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా రూ.263కోట్లతో 2.21 కిలోమీటర్ల మేర నిర్మించిన కొత్తగూడ ఫ్లై ఓవర్‌ (Kothaguda Flyover)ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) నేడు ప్రారంభిస్తారు. ఐటీ కారిడార్‌లో కేబుల్‌ వంతెనతో కలిపి ఇప్పటివరకు ఎనిమిది ఫ్లై ఓవర్లు వినియోగంలోకి వచ్చాయి. కొత్తగూడ వంతెనతో ఈ సంఖ్య తొమ్మిదికి చేరనుంది. ఫ్ల్లైఓవర్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శనివారం పరిశీలించారు. 2018లో హఫీజ్‌పేట నుంచి కొత్తగూడ, కొండాపూర్‌, బొటానికల్‌ గార్డెన్‌, గచ్చిబౌలి వరకు 2.21 కిలో మీటర్ల మేర రూ. 263 కోట్ల బడ్జెట్‌తో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Updated Date - 2023-01-01T12:50:43+05:30 IST