నిర్ణీత గడువులోగా లేఅవుట్ల అనుమతులను పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 22 , 2023 | 11:22 PM
లేఅవుట్ల అనుమ తులను నిర్ణీత గడువులోగా , నిబంధనల మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అనుబంధ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి లే అవుట్ అప్రూవల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఖమ్మంకలెక్టరేట్, డిసెంబరు22: లేఅవుట్ల అనుమ తులను నిర్ణీత గడువులోగా , నిబంధనల మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అనుబంధ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి లే అవుట్ అప్రూవల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఖమ్మం నగరపాలక సంస్థ, వైరా, మధిర, సత్తుపల్లి మునిసిపాలిటీలు సుడా పరిధిలో లే అవుట్ల ఆమోదం కోసం అందిన 23దరఖాస్తులను ఆయన పరిశీలించారు. నిబంధనల మేరకు అందిన దర ఖాస్తులను కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్బంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో లే అవుట్ల కోసం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్థల పరిశీలన చేసిన తర్వాతే 21రోజులలోపు అనుమతులను జారీ చేయా లన్నారు. దీనికి అనుగుణంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్, ఖమ్మం ఆర్డీవో జి గణేష్, జడ్పీ సీఈవో వింజం వెంకట అప్పారావు, డీపీవో హరికిషన్, పీఆర్ ఎస్‌ఈ చంద్రమౌళి, ల్యాండ్ సర్వే ఏడీ శ్రీనివాసులు, డీటీసీపీవో ప్రసాద్, టీపీవో వికాస్, సత్తుపల్లి, మధిర, వైరా మునిసిపల్ కమీషనర్లు, తహసీల్దార్లు, నీటిపారుదల శాఖ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.