TS News : కొత్తగూడెం కారు పార్టీలో కల్లోలం.. సుప్రీంకు వనమా

ABN , First Publish Date - 2023-07-26T09:39:42+05:30 IST

కొత్తగూడెం కారు పార్టీలో కల్లోలం రేగింది. వనమా వెంకటేశ్వరరావు వర్సెస్ జలగం వెంకట్రావుల మధ్య హీట్ పెరిగింది. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మరింత స్పీడ్ పెంచారు. ఈ రోజు స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీని వెంకట్రావు కలవనున్నారు. వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీని స్పీకర్‌కు.. అసెంబ్లీ కార్యదర్శికి వెంకట్రావు అందజేయనున్నారు. మరోవైపు హైకోర్టు తీర్పును నిలిపి వేయాలని కోరుతూ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.

TS News : కొత్తగూడెం కారు పార్టీలో కల్లోలం.. సుప్రీంకు వనమా

ఖమ్మం : కొత్తగూడెం కారు పార్టీలో కల్లోలం రేగింది. వనమా వెంకటేశ్వరరావు వర్సెస్ జలగం వెంకట్రావుల మధ్య హీట్ పెరిగింది. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మరింత స్పీడ్ పెంచారు. ఈ రోజు స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీని వెంకట్రావు కలవనున్నారు. వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీని స్పీకర్‌కు.. అసెంబ్లీ కార్యదర్శికి వెంకట్రావు అందజేయనున్నారు. మరోవైపు హైకోర్టు తీర్పును నిలిపి వేయాలని కోరుతూ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు(MLA Vanama Venkateswara Rao) ఎన్నిక చెల్లదని పేర్కొంటూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 2018 నాటి సాధారణ ఎన్నికల్లో ఆయనపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2018 డిసెంబర్‌ 12 నుంచి జలగం వెంకట్రావు(Jalagam Venkatarao)నే ఎమ్మెల్యేగా పరిగణించాలని స్పష్టం చేసింది. తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్‌(Election affidavit) దాఖలు చేసినందుకు వనమాకు రూ.5 లక్షల జరిమానా సైతం విధించింది. అంతేకాదు ఇప్పటివరకు ఈ కేసు కోసం జలగం వెంకట్రావుకు అయిన మొత్తం ఖర్చును సైతం చెల్లించాలని వనమాకు ఆదేశాలు జారీచేసింది. తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలను వనమా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని వెంకట్రావు చేసిన ఆరోపణలను హైకోర్టు(High Court) నిర్ధారించింది. ఈ క్రమంలో వనమా పేరిట ఉన్న భూములకు రైతుబంధు డబ్బులు విడుదల కావటం కూడా ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఒక కీలక ఆధారంగా నిలిచింది.

Updated Date - 2023-07-26T09:39:42+05:30 IST