‘తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే’ రాజకీయాలను తిప్పికొట్టాలి

ABN , First Publish Date - 2023-03-26T01:03:17+05:30 IST

జిల్లాలో కొందరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి రాజకీయాలను తిప్పికొట్టాలని రవాణ శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

‘తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే’ రాజకీయాలను తిప్పికొట్టాలి
వెజ్‌, నాన వెజ్‌ మార్కెట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి పువ్వాడ, కమల్‌ రాజు

25mdr01.jpgబహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ, ఎంపీ నామా

ఖమ్మంతో సమానంగా మధిర అభివృద్ధి

రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

మధిర/మధిర టౌన, మార్చి 25: జిల్లాలో కొందరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి రాజకీయాలను తిప్పికొట్టాలని రవాణ శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి మధిరలో జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఎంపీ నామా నాగేశ్వరావుతో కలిసి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో ఉంటూనే ఆపార్టీ ద్వారా పొందిన ప్రయోజం మరిచి చివరికిఆ పార్టీపైనే ఆరోపణలు చేయడం మంచిదికాదన్నారు. తాను మాత్రం ఏపార్టీలో ఉంటే ఆ పార్టీకి కట్టుబడి ఉంటానన్నారు. పార్టీని విమర్శించే వారు తనకు శత్రువేనన్నారు. మధిరను ఖమ్మంతో సమానంగా అన్ని రంగాల్లో అభివద్ధి చేసి చూపించామన్నారు. దుర్లబంగా ఉన్న మధిర చెరువును సుందరంగా తీర్చిదిద్దామన్నారు. కమల్‌రాజు పట్టుబట్టి మరీ బోటు తెప్పించుకున్నారని తెలిపారు. అకాలవర్షాలకు పంట దెబ్బతిన్న రైతులకు మూడు రోజుల్లోనే సీఎం స్వయంగా వచ్చి పరిహారం ప్రకటించారన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఎకానికి రూ.10వేలు పరిహారం ఇస్తున్నామన్నారు. మధిరలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఉంటే నియోకవర్గం మొత్తం ఇదే విదంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో రాబోయే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పదికి పది స్థానాల్లో గెలుపొందడం ఖాయంగా తెలిపారు. ప్రశ్నాపత్రాలు లీకుల వ్యవహారంతో కేటీఆర్‌పై చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖడించారు. దేశంలో ప్రతిపక్ష నాయకులపై ఐటీ, ఈడి సీబీఐలతో మోదీ వేదిస్తున్నారన్నారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తప్పుబట్టారు. సభలో ఎం పీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, కొండబాల కోటేశ్వరరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొండితోక లత, వైస్‌ చైర్‌పర్సన్‌ శీలం విద్యాలత, బొమ్మెర రామ్మూర్తి, చిత్తారు నాగేశ్వరరావు, మల్లాది వాసు, జయాకర్‌, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు శనివారం మధిర మునిసిపాలిటిలో సుమారు రూ.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. రూ5.70 కోట్లతో నిర్మించిన ట్యాంక్‌బండ్‌ను, రూ.4.50కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన వెజ్‌ మార్కెట్‌ను ప్రారంభించారు. తెలంగాణా తల్లి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి మధిరకు ప్రకటించిన రూ30 కోట్ల నిధులతో పాటు ఎల్‌ఆర్‌ఎస్‌ నిదులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన శిలాపలకాన్ని ఆవిష్కరించారు.

Updated Date - 2023-03-26T01:03:17+05:30 IST