రాజకీయాల్లో డబ్బు, మత ప్రభావం పెరిగింది
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:55 PM
ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు, కులం, మతం ప్రభావం పెరిగిందని, ప్రజా సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళ వారం గిరిప్రసాద్ భవన్‌లో నిర్వహించిన సీపీఐ99వ ఆవిర్బావ దినోత్సవం లో పార్టీ జెండాను పువ్వాడ నాగేశ్వరరావు ఆవిష్కరించారు.
సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు
ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవం
ఖమ్మంసంక్షేమవిభాగం, డిసెంబరు26: ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు, కులం, మతం ప్రభావం పెరిగిందని, ప్రజా సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళ వారం గిరిప్రసాద్ భవన్‌లో నిర్వహించిన సీపీఐ99వ ఆవిర్బావ దినోత్సవం లో పార్టీ జెండాను పువ్వాడ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కమిటీ సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సహాయ కార్యదర్శి దండి సురేశ్, జమ్ముల జితేందర్‌రెడ్డి, సిద్దినేని కర్ణకుమార్, మహ్మాద్ సలామ్, తాటి వెంకటేశ్వరరావు, ఇటికాల రామకృష్ణ, మేకల శ్రీనివాసరావు, తాటి నిర్మల పాల్గొన్నారు.
మధిర: మధిరలోని ఆపార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని పార్టీ కార్యాలయం వద్ద జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవి, వాసిరెడ్డి వెంకటపతి స్థూపం వద్ద మండల కార్యదర్శి ఊట్ల కొండలరావు ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు మంగళగిరి రామానుజం, సంగా శేషగిరి, చెరుకూరి వెంకటేశ్వరరావు, మారారెడ్డి, అన్నవరపు సత్యనారాయణ, తదితర నాయకులు పాల్గొన్నారు.
వైరా: వైరాలో మండల కార్యదర్శి యామాల గోపాలరావు పార్టీ జెండా ఎగురవేశారు. కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మిట్టపల్లి రాఘవరావు, గారపాటి అశోక్, కొండా రామకృష్ణ, మోటా కొండా, దొబ్బల కృష్ణయ్య, షేక్.జానీ, రుద్రాక్షల లక్ష్మయ్య, తిరుమలయ్య పాల్గొన్నారు.
కొణిజర్ల: మండలకేంద్రం పార్టీ కార్యాలయంలో సీపీఐ జిల్లా నాయకులు దొండపాటి రమేష్, సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకయ్య, బండారు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్వర్ణ రమేష్, తోటపల్లి సీతరాములు, తండు సోమయ్య, గొడ్డుగర్ల రాంబాబు, రజాక్, గోపయ్య, వెంకన్న, భాస్కర్, బాబు, సైదులు పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్: మండల కేంద్రంలో సీపీఐ జిల్లా సహయ కార్యదర్శి దండి సురేష్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎల్ జాతీయ సమితి సభ్యులు శేషగిరి, నాయకులు వెంపటి సురేందర్ పెద్ద వెంకటరెడ్డి, దండి రంగారావు, వెన్నం బాస్కర్, పెద్ద సైదిరెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.
ఏన్కూరు: సీపీఐ మండల కార్యదర్శి జాగర్లముడి రంజిత్‌కుమార్ ఏన్కూరు ప్రధాన సెంటర్‌లో అమరనేని వీరభద్రం ఆధ్వర్యంలో సీపీఐ జెండాను ఆవిష్కరించారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని తెలిపారు.