పొంగులేటి నిర్ణయంపై ఉత్కంఠ

ABN , First Publish Date - 2023-05-26T00:05:09+05:30 IST

బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన రాజకీయ భవిష్యతపై తీసుకోబోయే నిర్ణయం తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. ఆయన ఏపార్టీలో చేరబోతున్నారనే దానిపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరుతారా? లేదంటే బీజేపీపై ఆసక్తితో ఉన్నారా? సొంతపార్టీ పెట్టబోతున్నారా? అన్న చర్చల నేపథ్యంలో ఆయన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి గురువారం హైదరాబాదులోని ఒక ఫామ్‌హౌస్‌లో రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ చైర్మన ఈటల రాజేందర్‌తో భేటీకావడం చర్చనీయాంశమైంది. అయితే బుధవారం ఏపీ సీఎం జగన్మోహనరెడ్డిని తాడేపల్లిలో కలిసిన పొంగులేటి.. మరుసటి రోజు ఈటల రాజేందర్‌తో సమావేశం కావడంతో పొంగులేటి బీజేపీలో చేరికకు ఆసక్తి చూపుతున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే ఏపీలో పలు కాంట్రాక్టు పనులతోపాటు మైనింగ్‌ టెండర్లు ద

 పొంగులేటి నిర్ణయంపై ఉత్కంఠ

జూపల్లితో కలిసి బీజేపీ నేత ఈటలతో సమావేశం

ఖమ్మం, మే 25 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన రాజకీయ భవిష్యతపై తీసుకోబోయే నిర్ణయం తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. ఆయన ఏపార్టీలో చేరబోతున్నారనే దానిపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరుతారా? లేదంటే బీజేపీపై ఆసక్తితో ఉన్నారా? సొంతపార్టీ పెట్టబోతున్నారా? అన్న చర్చల నేపథ్యంలో ఆయన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి గురువారం హైదరాబాదులోని ఒక ఫామ్‌హౌస్‌లో రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ చైర్మన ఈటల రాజేందర్‌తో భేటీకావడం చర్చనీయాంశమైంది. అయితే బుధవారం ఏపీ సీఎం జగన్మోహనరెడ్డిని తాడేపల్లిలో కలిసిన పొంగులేటి.. మరుసటి రోజు ఈటల రాజేందర్‌తో సమావేశం కావడంతో పొంగులేటి బీజేపీలో చేరికకు ఆసక్తి చూపుతున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే ఏపీలో పలు కాంట్రాక్టు పనులతోపాటు మైనింగ్‌ టెండర్లు దక్కించుకున్న పొంగులేటి ఆయా పనుల నిమిత్తం జగనను కలిశారని పొంగులేటి వర్గీయులు చెబుతున్నా.. ఆ మరుసటిరోజే హైదరాబాద్‌లో బీజేపీ చేరికల కమిటీ చైర్మన ఈటల రాజేందర్‌తో సమావేశం కావడం, మాజీమంత్రి జూపల్లి కూడా వెంట ఉండటంతో వారి చేరిక విషయం ఉత్కంఠగామారింది. అయితే ఈ సమావేశానికి ఎవరినీ రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోగా.. ఈ భేటీలో తాము ఏ పార్టీలో చేరతామన్నది ఈటలతో స్పష్టం చేశారన్న ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బీజేపీలోకి రావాలని ఈటలతోపాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే రఘునందనరావుతపాటు మరికొందరు ఖమ్మంలో పొంగులేటి నివాసానికి వచ్చి చర్చలు జరిపారు. అయితే పొంగులేటి బీజేపీ నేతలకు పార్టీలో చేరే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అయితే ఆయన కొన్ని అనుమానాలను ఈటల రాజేందర్‌ ముందు ఉంచినట్టు ప్రచారం జరిగింది. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన ఈటల అక్కడ జరిగిన చర్చల విషయాలను పొంగులేటికి చెప్పారని, దాంతో పొంగులేటి ఆయన్ను కలిశారన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఎవరికి అందుబాటులో లేకుండా ఈటలతో మాజీ ఎంపీ పొంగులేటి, మాజీమంత్రి జూపల్లి మాత్రమే సమావేశం కావడంపై ఊహగానాలు వ్యక్తమవున్నాయి. ఖమ్మంజిల్లాలో మాత్రం పొంగులేటి దారి కాంగ్రెస్‌ అని మొన్నవటి వరకు ఆయన ప్రత్యర్థి వర్గాలు ప్రచారం చేయగా ఇప్పుడు పొంగులేటి దారి బీజేపీ అని ప్రత్యర్థి వర్గీయులు ప్రచారం నిర్వహిస్తున్నారు. పొంగులేటి రాజకీయనిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.

Updated Date - 2023-05-26T00:05:23+05:30 IST