అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన

ABN , First Publish Date - 2023-03-10T23:33:43+05:30 IST

అశ్వారావుపేట పట్టాణంలో స్ధానిక రింగ్‌ రోడ్‌ సెంటర్‌ లో మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్ధులకు అగ్నిప్రమాదలపై ముందుస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై అగ్నిమాపక అగ్నిప్రమాక అధికారులు శుక్రవారం అవగాహన కల్పించారు.

అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన
అవగాహన కల్పిస్తున్న దృశ్యం

అశ్వారావుపేట టౌన్‌, మార్చి 10: అశ్వారావుపేట పట్టాణంలో స్ధానిక రింగ్‌ రోడ్‌ సెంటర్‌ లో మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్ధులకు అగ్నిప్రమాదలపై ముందుస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై అగ్నిమాపక అగ్నిప్రమాక అధికారులు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గృహలలో అకస్మికంగా సంభవించిన గ్యాస్‌ మంటాలను ఆర్పే విధానంను చేసి చూపించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ముందుగా స్ధానిక అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందిచాలని, ఆతరువాత మంటలు ఆర్పేందుకు తమ వంతు ప్రయత్నం చేయడం ద్వారా ప్రమాదాలను కొంతవరకు నివారించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వీరబాబు, సింగరాజు, సిహెచ్‌ నరేష్‌, ప్రిన్సిపాల్‌ సుమలత, సంజీవకూమారి, ప్రమీల, లలిత, అరుణశ్రీ, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-10T23:33:43+05:30 IST