ఏడు చోట్ల రెడ్‌ అలర్ట్‌

ABN , First Publish Date - 2023-06-02T23:10:41+05:30 IST

ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఎండ తీవ్రతకు తోడు వడగాలులు ఎక్కువవడంతో జనం అల్లాడిపోయారు. అత్యధికంగా నేలకొండపల్లి మండలంలో 46.6 డిగ్రీలు, ముదిగొండ మండలం బాణాపురం, పమ్మి ప్రాంతాల్లో 46.3, ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీస్‌ స్టేషన ప్రాంతంలో 45.2, సత్తుపల్లిలో 45.1డిగ్రీలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైలులో 45.4, మ

  ఏడు చోట్ల రెడ్‌ అలర్ట్‌

ఉమ్మడి జిల్లాలో మండుతున్న ఎండలు

నేలకొండపల్లిలో అత్యధికంగా 46.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఖమ్మం, జూన 2 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఎండ తీవ్రతకు తోడు వడగాలులు ఎక్కువవడంతో జనం అల్లాడిపోయారు. అత్యధికంగా నేలకొండపల్లి మండలంలో 46.6 డిగ్రీలు, ముదిగొండ మండలం బాణాపురం, పమ్మి ప్రాంతాల్లో 46.3, ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీస్‌ స్టేషన ప్రాంతంలో 45.2, సత్తుపల్లిలో 45.1డిగ్రీలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైలులో 45.4, మణుగూరులో 45.1డిగ్రీలు నమోదవగా... ఈ ఏడు ప్రాంతాలను వాతావరణశాఖ రెడ్‌ అలర్డ్‌ జోనగా ప్రకటించింది. వాటితోపాటు ఖమ్మం రూరల్‌ మండలం పల్లెగూడెంలో 44.9, దమ్మపేట మండలం నాయుడుపేటలో 44.8, మధిరలో 44.7, ఏడూళ్ల బయ్యారం, అశ్వాపురంలో 44.5, ఎర్రుపాలెంలో44.4, భద్రాచలం, కొత్తగూడెంలలో 44.2, ఖమ్మం ప్రకాష్‌నగర్‌లో 43.9, సదాశివపురంలో 43.3, ఖమ్మం ఎన్నెస్పీ గెస్ట్‌ గౌస్‌ ప్రాంతంలో 43.3, అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లంలో 43.2, ఏన్కూరు, గుండాలలో 43.1, కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో, కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 42.8, రఘునాథపాలెం, కారేపల్లిలో 42.7, చండ్రుగొండ మండలం మద్దుకూరులో 42.7, ఇల్లెందులో 42.3, వైరా, కుర్నవల్లి, కొణిజర్ల మండల కేంద్రంలో 42.1ఉండగా.. కూసుమంచిలో 41.8, అశ్వారావుపేటలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాలను ఆరెంజ్‌ జోనగా ప్రకటించింది.

Updated Date - 2023-06-02T23:10:41+05:30 IST