రేపు భద్రగిరిలో పుష్కర తీర్థ యాత్ర
ABN , First Publish Date - 2023-03-18T01:42:25+05:30 IST
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 31న స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రతువులో వినియోగించేందుకుగాను వైదిక సిబ్బంది దేశం నలుమూలల నుంచి తీర్థ జలాలు, దర్బలను సేకరించి వాటితో ఆదివారం భద్రాచలం రానున్నారు.
మహా సామ్రాజ్య పట్టాభిషేక క్రతువు కోసం కృష్ణా జిల్లా పెద్దవరంలో దర్బలు,
దేశం నలుమూలలనుంచి సేకరించిన తీర్థజలాలతో వైదిక సిబ్బంది రాక
మేళతాళాలతో స్వాగతం పలకనున్న దేవస్థానం అధికారులు
భద్రాచలం, మార్చి 17: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 31న స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రతువులో వినియోగించేందుకుగాను వైదిక సిబ్బంది దేశం నలుమూలల నుంచి తీర్థ జలాలు, దర్బలను సేకరించి వాటితో ఆదివారం భద్రాచలం రానున్నారు. ఈ క్రమంలో భద్రాచలంలోని గోదావరి వారధి వద్ద వారికి ఘనస్వాగతం పలికి.. పుష్కర తీర్థ యాత్రను నిర్వహించేందుకు దేవస్థానం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదివారం గోదావరి వారధి వద్ద నుంచి ప్రధాన ఆలయం వరకు మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల కోలాటాల మధ్య పుష్కర తీర్ధ యాత్ర నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు కసరత్తు పూర్తిచేశారు. సీతారామచంద్రస్వామికి 12 ఏళ్లకోసారి నిర్వహించే పుౄష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని ఈ సారి భద్రాద్రి దేవస్థానం సంప్రదాదయబద్దంగా నిర్వహిస్తున్న క మ్రంలో సముద్రాలు, నదులు, పుష్కరిణిల నుంచి తీర్థజలాలను, దర్బలను మంత్ర సంపుటింతగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సేకరించారు. వాటితో పుష్కర తీర్థయాత్ర వైభవంగా నిర్వహించనున్నామని భద్రాద్రి వారధి వద్ద దేశం నలుమూలల నుంచి తీర్థజలాలను సేకరించి వస్తున్న వైదిక సిబ్బందికి ఘనస్వాగతం పలకాలని దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి, కార్యనిర్వహణాధికారి శ్రావణ్‌కుమార్ కోరారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కరుణాకటక్షాౄలకు పాత్రులు కావాలని సూచించారు. ఇదిలా ఉండగా హోమాలు నిర్వహించే యాగశాలలో హోమకుండాలను విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి రామచంద్రాచార్యులు పర్యవేక్షణలో నిర్ణీత కొలతలతో నిర్మిస్తున్నారు.