అందరికీ ఆమోద యోగ్యంగా పాపటపల్లి-మిర్యాలగూడ రైలుమార్గం
ABN , First Publish Date - 2023-05-26T00:06:54+05:30 IST
నమూనాల మార్పుతో పాటు ఖమ్మం జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆమోదయోగ్యంగా ఉండేలా పాపటపల్లి-మిర్యాలగూడ నూతన రైలుమార్గాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీచైర్మన, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు రైల్వే అధికారులకు సూచించారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చైర్మన హోదాలో దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ రహదా

నమూనా మార్పుతో నిర్మాణం జరగాలి
దిశ కమిటీ సమావేశంలో చైర్మన, ఎంపీ నామ నాగేశ్వరరావు
వైద్యరంగంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి : ఎంపీ వద్దిరాజు
ఖమ్మం, మే 25 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : నమూనాల మార్పుతో పాటు ఖమ్మం జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆమోదయోగ్యంగా ఉండేలా పాపటపల్లి-మిర్యాలగూడ నూతన రైలుమార్గాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీచైర్మన, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు రైల్వే అధికారులకు సూచించారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చైర్మన హోదాలో దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ రహదారులు, పంచాయతీరాజ్, ఇరిగేషన,విద్యుత, మునిసిపల్, రైల్వే, డీఆర్‌డీఏ, వైద్యారోగ్యం, పరిశ్రమలశాఖలకు సంబంధించి ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ తొలుత ప్రతిపాదించిన మిర్యాలగూడెం కొత్త రైలుమార్గం అలైనమెంట్ వల్ల ఖమ్మంరూరల్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లోని 12గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు, చిన్న, సన్న కారు రైతులకు తీవ్ర నష్టం జరగనుందని, ఇప్పటికే సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలు, ప్రతిపాదనలను కేంద్ర రైల్వేమంత్రికి, బోర్డుచైర్మనకు, జనరల్‌మ మేనేజర్‌కు తెలియజేయగా.. అలైనమెంట్ మార్పునకు అంగీకారం వచ్చిందన్నారు. అయితే రైల్వేశాఖ అధికారులు ప్రొటోకాల్ పాటించడంలేదని, పనులు ప్రారంభం, ఇతర విషయాల గురించి సమాచారం ఇవ్వడంలేదని, నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై చర్యలు తప్పవన్నారు. రైల్వేశాఖ అధికారులు దిశ కమిటీ సమావేశాలకు విధిగా హాజరుకావాలని సూచించారు. అనధికారిక లేఅవుట్లు, కాలవల పూడ్చివేతలు, విద్యుత కోతలు, సరఫరాలో సమస్యలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, జాతీయ రహదారుల నిర్మాణ పురోగతి, తదితర అంశాలపై చర్చించారు.కొత్త రహదారుల కోసం రూ.755కోట్లతో ప్రతిపాదనలు పంపామని, తాను కేంద్రమంత్రులకు లేఖల రాయడం ద్వారా రూ.184.80కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ వైద్యరంగంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని, వైద్యశాఖకు సంబంధించి ఎలాంటి అవసరం ఉన్నా ప్రజా ప్రతినిధులుగా సమస్యను మా దృష్టికి తేవాలని సూచించారు. ఈసమావేశంలో జడ్పీ చైర్మన లింగాల కమల్‌రాజ్, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఖమ్మం కార్పొరేషన కమిషనర్ ఆదర్శసురభి, అదనపు కలెక్టర్ మధుసూదన, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్‌సింగ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, దిశ కమిటీసభ్యులు సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.