ఘనంగా ముక్కోటి
ABN , First Publish Date - 2023-01-02T23:32:35+05:30 IST
తమకు దేవునికి మధ్య గల అడ్డుతెర తొలగిపోతుంటే భక్తులు తన్మయత్వంతో పులకించిపో యారు..
నెటవర్క్: తమకు దేవునికి మధ్య గల అడ్డుతెర తొలగిపోతుంటే భక్తులు తన్మయత్వంతో పులకించిపో యారు.. తెల్లవారు జామున స్వామి వారి దర్శనం ఆకా శంలో సాక్షాత్కరించినట్లుగా భావించారు.. ఉత్తరద్వార దర్శనంలో స్వామివారి నిజ రూప దర్శనంతో అనుభూతికి లోనయ్యారు. ముక్కోటి దేవతలు కొలువుతీరే వైకుం ఠద్వార దర్శనాన్ని తిలకించేందుకు భ క్తులు తరలి రావ టంతో ఆలయాలు తెల్లవారుజామునుంచే కిటకిటలా డాయి.. వెరసి సోమవారం జిల్లావ్యాప్తంగా ముక్కోటి ఏకా దశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఖమ్మం, వైరా, సత్తుప ల్లి, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో ఆలయాల్లో రద్దీ ఏర్ప డింది. ఈసందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు పులిహోర ప్రసాదాలను పంచారు. పలు చోట్ల పువ్వులు, తులసి దళాలు ఉచితంగా అందజేశారు.