జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ
ABN , First Publish Date - 2023-05-02T23:51:37+05:30 IST
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఖమ్మం లకారం ట్యాంకుబండ్‌లో ఏర్పాటు చేయనున్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడిరాష్ట్ర మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామా
28న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం
ఖమ్మం, 2 (ఆంధ్రజ్యోతి) : రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఖమ్మం లకారం ట్యాంకుబండ్‌లో ఏర్పాటు చేయనున్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడిరాష్ట్ర మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామారావు 54అడుగుల శ్రీకృష్ణావతారంలోని భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం పలికారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ నెల 28న విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా.. ఆ విగ్రహ నమూనా, నిర్మాణ వివరాలను మంత్రి పువ్వాడ ఎన్టీఆర్‌కు వివరించారు. మంత్రి వెంట సినీ దర్శకుడు కొరటాల శివ, విగ్రహ శిల్పి ప్రతాప్‌వర్మ ఉన్నారు. 36అడుగుల వెడల్పు, పొడువు ఉండే బేస్‌మెంట్‌తో కలిపి ఈ విగ్రహం ఎత్తు 54 అడుగులు ఉండనుండగా.. దీని కోసం రూ.2.30కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన శిల్పి ప్రతాప్‌వర్మ తీర్చిదిద్దుతున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని నిజామాబాద్ నుంచి ఖమ్మానికి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.