ఎంపీ నామతో మంత్రి భేటీ
ABN , First Publish Date - 2023-09-26T23:58:44+05:30 IST
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ముగించుకొని ఢిల్లీ నుంచి ఖమ్మం చేరుకున్న బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావుతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి ఖమ్మంలోని నామ ని
ఖమ్మం కార్పొరేషన్, సెప్టెంబరు 26 : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ముగించుకొని ఢిల్లీ నుంచి ఖమ్మం చేరుకున్న బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావుతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి ఖమ్మంలోని నామ నివాసానికి వెళ్లిన మంత్రి.. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, బీఆర్‌ఎస్ వైరా అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్‌తో కలిసి సమాలోచనలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని సీట్లు గెలుచుకోవాలని, వైరా స్థానాన్ని సునాయాసంగా కైవసం చేసుకునేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని ఎంపీ నామ, మంత్రి పువ్వాడ.. ఎమ్మెల్యే రాములునాయక్, అభ్యర్థి మదన్ లాల్‌ను కోరారు. నేతల సమన్వయం కోసం మండలాలు, గ్రామాల వారీగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లాలని వారు సూచించారు.