వర్షాభావం.. విద్యుత అంతరాయం
ABN , First Publish Date - 2023-09-25T23:57:25+05:30 IST
ఓ వైపు వర్షాభావ పరిస్థితి.. మరో వైపు పెరిగిన విద్యుత వాడకంతో సరఫరాలో ఎదురవుతున్న సమస్యలతో అన్నదాతలు అవస్థలు పాలవుతున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన ప్రారంభంలో ఎంతో ఆశతో రైతులు పంటలు సాగుచేయగా.. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో గడ్డుకాలం ఏర్పడింది.
సక్రమంగా నీరందక ఎండుతున్న పంటలు
విద్యుత అధిక వినియోగంతో సరఫరాలో సమస్యలు
కాలిపోతున ్న మోటార్లు.. అవస్థలు పడుతున్న రైతులు
కల్లూరు, సెప్టెంబరు 25 : ఓ వైపు వర్షాభావ పరిస్థితి.. మరో వైపు పెరిగిన విద్యుత వాడకంతో సరఫరాలో ఎదురవుతున్న సమస్యలతో అన్నదాతలు అవస్థలు పాలవుతున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన ప్రారంభంలో ఎంతో ఆశతో రైతులు పంటలు సాగుచేయగా.. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో గడ్డుకాలం ఏర్పడింది. దీనికి తోడు నాగార్జున సాగర్ ఎడమకాల్వ నుంచి అందే పరిస్థితి లేకపోవడంతో రైతులంతా వ్యవసాయ బోర్లు, బావులపై ఆధారపడ్డారు. తొలకరి వానల సమయంలో పలు వనరుల కింద వేసిన వరి ప్రస్తుతం చిరుపొట్టదశలో ఉండగా.. నీటి తడులు సక్రమంగా అందించలేక రైతులు అల్లాడుతున్నారు. ముఖ్యంగా పంటలు ఎక్కువగా సాగయ్యే కల్లూరు మండలంలోని లింగాల, ఎర్రబోయనపల్లి, పెద్దకోరుకోండి, చెన్నూరు.పాయాపూరు, వాచ్యానాయక్‌తండా తదితర గ్రామాల్లో రైతులు వాగులు, నేలబావులు, బోర్ల నుంచి వరికి తడులు అందిస్తూ పైరును కాపాడుకుంటున్నారు. ఈ క్రమంలో త్రీఫేస్ విద్యుత వాడకం భారీగా పెరిగింది. అయితే రైతులు ఏక కాలంలో మోటార్లు వినియోగించటంతో పెద్దకోరుకొండి విద్యుతసబ్‌స్టేషన పరిధిలోని గ్రామాల్లో విద్యుత సరఫరాకు అంతరాయం కలుగుతోలంది. ఇలా చెన్నూరు ఫీడర్ పరిధిలో సుమారు 5 వేల ఎకరాల్లో వరికి సుమారు 1000 వరకు విద్యుత మోటార్లు ద్వారా నీరందిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క లింగాల గ్రామంలోనే ఇప్పటికే 30 కుపైగా విద్యుత మోటార్లు కాలిపోయాయని రైతులు వాపోతున్నారు. సాగుకు 24 గంటలు విద్యుత సరఫరా అవ్వాల్సి ఉండగా.. తరుచూ ఏర్పడుతన్న సాంకేతిక లోపంతో మోటార్లు పని చేయక పంట తాము పొలాల వద్దే పడిగాపులు పడాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో మండలంలోని లింగాల గ్రామంలో అదనంగా 33/11 కేవీ విద్యుత సబ్‌స్టేషన ఏర్పాటు చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యుత వాడకంలో పెరిగిన డిమాండ్
తిరుపతయ్య, కల్లూరు ఏఈ
వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి పంటలకు బావులు, బోర్లు, వాగుల నీటిని విద్యుత మోటార్లను వినియోగించి అందిస్తున్నారు. ఏకకాలంలో మోటార్లను వినియోగిస్తుండటంతో త్రీఫేస్ విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. మోటార్లు కాలిపోవడానికి అధిక వినియోగం కూడా కారణం. సాగర్ నుంచి నీరు లేకపోవటం సమస్యకు మరింత కారణమవుతోంది. మేం మాత్రం వ్యవసాయానికి 24గంటలు విద్యుత ఇస్తున్నాం.