తెలంగాణ క్యాడర్‌కు ఐపీఎస్ మౌనిక
ABN , First Publish Date - 2023-03-05T00:29:33+05:30 IST
భద్రాచలం పట్టణానికి చెందిన ఐపీఎస్ అధికారి పోరిక మౌనిక ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకొని తెలంగాణ క్యాడర్‌కు కేటాయించబడ్డారు. రాషా్ట్రనికి ఇటీవల పలువురు ఐపీఎ్‌సలను కేటాయించగా వారిలో మౌనిక కూడా ఉన్నారు.
గతేడాది సివిల్స్ ఫలితాల్లో 637వ ర్యాంకు సాధించిన భద్రాచలం వాసి
భద్రాచలం, మార్చి 4: భద్రాచలం పట్టణానికి చెందిన ఐపీఎస్ అధికారి పోరిక మౌనిక ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకొని తెలంగాణ క్యాడర్‌కు కేటాయించబడ్డారు. రాషా్ట్రనికి ఇటీవల పలువురు ఐపీఎ్‌సలను కేటాయించగా వారిలో మౌనిక కూడా ఉన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలానికి చెందిన పోరిక మౌనిక గత ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో 637ర్యాంకును సాధించారు. మౌనిక తండ్రి రామ్‌కుమార్ హైదరాబాద్‌లోని బీడీఎల్‌లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తుండగా తల్లి వాణికుమారి భద్రాచలంలో పెట్రోలు బంక్ నిర్వహిస్తున్నారు. మౌనిక తన ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అంతా హైదరాబాద్‌లో చదివి బ్యాచలర్ ఆఫ్ ఫార్మసీ పట్టాను పొందారు. ఆరోసారి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైన ఆమె 637వ ర్యాంకు సాధించడంతో ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు.