గిరిజనుల ఏళ్లనాటి గోస తీర్చాం

ABN , First Publish Date - 2023-07-01T01:23:30+05:30 IST

పోడు పట్టాలు అందజేసి గిరిజనుల ఏళ్లనాటా గోస తీర్చామని, వారికి హక్కులు కల్పించడంతో పాటు మరో పది రకాల ప్రయోజనాలను కూడా సమకూర్చామన్నాని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థికశాఖామంత్రి తన్నీరు హరీ్‌షరావు పేర్కొన్నారు. శుక్రవారం పాల్వంచలోని సుగుణ ఫంక్షన్‌హాలు, ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పోడు రైతులకు హక్కు పత్రాలు అందజేశారు.

గిరిజనుల ఏళ్లనాటి గోస తీర్చాం
మంత్రుల నుంచి పట్టా అందుకున్న ఆనందంలో ఓ మహిళా రైతు

WhatsApp-Image-2023-06-30-a.jpgఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో పోడురైతులకు పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రులు హరీ్‌షరావు, పువ్వాడ అజయ్‌ కుమార్‌

పండుగలా పోడుపట్టాల పంపిణీ

కాంగ్రెస్‌ వస్తే కరెంటు కోతలొస్తాయి.

దిక్కులేనోళ్లంతా ఒక్కటయ్యారు

అయినా మాకేం నష్టం లేదు

ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీ్‌షరావు

మంత్రి పువ్వాడతో కలిసి ఇరుజిల్లాల్లో పోడుపట్టాలు పంపిణీ

కొత్తగూడెం/ఖమ్మం, జూన 30 (ఆంధ్రజ్యోతి) : పోడు పట్టాలు అందజేసి గిరిజనుల ఏళ్లనాటా గోస తీర్చామని, వారికి హక్కులు కల్పించడంతో పాటు మరో పది రకాల ప్రయోజనాలను కూడా సమకూర్చామన్నాని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థికశాఖామంత్రి తన్నీరు హరీ్‌షరావు పేర్కొన్నారు. శుక్రవారం పాల్వంచలోని సుగుణ ఫంక్షన్‌హాలు, ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పోడు రైతులకు హక్కు పత్రాలు అందజేశారు. తొలుత పాల్వంచలో హరీష్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీని పండుగలా నిర్వహిస్తున్నామని, దీంతో ఏళ్లనాటి సమస్యకు పరిష్కారం చూపామన్నారు. రాష్ట్రంవ్యాప్తంగా 4లక్షల6వేల పట్టాలు ఇస్తుంటే ఒక్క భద్రాద్రి జిల్లాలోనే 1,51,195 వేల ఎకరాలకు పత్రాలిస్తున్నామన్నారు. పట్టాలు పొందిన ప్రతీ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత, రైతుబంధు పథకాలను వర్తింపజేస్తోందన్నారు. ఇకపై పోడు రైతుల వద్దకు ఏ అధికారి రాడని, భయం లేకుండా సాగుచేసుకోవచ్చన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతే పరిహారం పొందడానికి అర్హులవుతారని వ్యవసాయ మార్కెట్‌, సహకార సంఘాల్లో సభ్యులుగా ఉండబోతున్నారని, బ్యాంకుల్లో పంట రుణాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ఇక ఇప్పటివరకు ఉన్న అటవీ కేసులను ఎత్తివేసే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రరావాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబాలకు పోడు పట్టాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, ఎంతో విలువైన భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులను భూ యజమానులను చేస్తున్నామన్నారు. భద్రాద్రి జిల్లాలో సుమారు 50వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందన్నారు. ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ పోడు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇందుకు సీఎంకు కృతజ్ఞతలు అన్నారు. బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదివాసీల దేవుడని, త్వరలోనే పోడు భూముల విషయంలో గతంలో గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తివేసేందుకు ఆయనతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. శతాబ్దాల నాటి సమస్యకు దశాబ్దకాలంలోనే పరిష్కారం చూపిన ఘనుడు కేసీఆర్‌ ప్రశంసించారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, స్పెషల్‌ సీఎస్‌ రామకృష్ణారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌, ఐటీడీఏ పీవో గౌతమ్‌, ఎస్పీ డాక్టర్‌ వినీత, అటవీ అధికారి రంజిత, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన దిండిగాల రాజేందర్‌, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, జిల్లా అధికారులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, పోడురైతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు ఇటీవల గుండెపోటుతో మరణించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఖమ్మం చేరుకున్న ఆయన తొలుత పాత కలెక్టరేట్‌లోని మెడికల్‌ కళాశాల ఏర్పాటు పనులను పరిశీలించారు. అనంతరం ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పోడు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా హరీ్‌షరావు మాట్లాడుతూ మాట్లాడితే తమ పాలన మళ్లీ తెస్తామని అంటున్నారని, కాంగ్రెస్‌ పాలన అంటే కరెంటు కోతలు, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్సఫార్మర్లు, ఖాళీ బిందెలతో పడిగాపులు, ధర్నాలు, కరెంటు కోసం ఒత్తులేసుకుని చూసిన రోజులేనా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే కరెంటు కోతలే వస్తాయన్నారు. నాడు 2009 ఎన్నికల మానిఫెస్టోలో తండాలు, గూడేలను గ్రామపంచాయతీలు చేస్తామని.. ఐదేళ్లు అధికారంలో ఉన్నా చేయకుండా మోసగించిందన్నారు. కానీ కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం 2471 గ్రామపంచాయతీలు చేశారన్నారు. గిరిజన సంక్షేమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ఎంతో కృషిచేస్తున్నామన్నారు. అధికారంలో ఉన్నప్పుడూ ఏమీ చేయని కాంగ్రెసోళ్లు ఎన్నికలు రాగానే ఇస్త్రీ చొక్కా, ప్యాంటు వేసుకుని బయలుదేరతారని, ఎన్నికలున్నా.. లేకపోయినా బీఆర్‌ఎస్‌ ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. తాము వద్దనుకుని పక్కనపెట్టినోళ్లు.. దిక్కులేక కాంగ్రె్‌సలో చేరుతున్నారని, వారంతా ఒక్కటైఔనా తమకొచ్చే నష్టమేంలేదని, తమకు పట్టిన శని వదిలిందని, వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఉండబోతున్నాయన్నారు. ఇప్పుడు తమ పార్టీలో చేరుతున్న వ్యక్తి గురించి గతంలో భట్టి విక్రమార్క గుత్తేదారు అనీ, ఆర్థిక అరాచకవాది అని మాట్లాడాడనీ, నాడు వద్దనుకున్నోడు ఇవాళ ఎలా ముద్దయ్యాడో భట్టి చెప్పాలన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ చెబుతది కానీ చేయదని, ఇందిరాసాగర్‌, రాజీవ్‌సాగర్‌ లాంటి ప్రాజెక్టులపై విచారణ జరిపితే వారి అవినీతి బయటపడుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలో లక్షా 64వేల పోడు భూముల పట్టాల పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఆర్థికశాఖ స్పెషల్‌ సెక్రటరీ రామకృష్ణ, ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, ఎమ్మెల్సీ తాతామధుసూదన్‌, వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు రాములు నాయక్‌, హరిప్రియ, విత్తనాభిసంస్థ, డీసీఎంస్‌ చైర్మన్లు కొండబాల కోటేశ్వరరావు, రాయల శేషగిరిరావు, మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆదర్శ సురభి, అటవీ శాఖ జిల్లా అధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-01T01:23:30+05:30 IST