అభివృద్ధి, సంక్షేమంలో మున్ముందుకు

ABN , First Publish Date - 2023-06-02T23:16:25+05:30 IST

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధి, సంక్షేమంలో మున్ముందుకు దూసుకుపోతున్నామని, పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్‌లో

 అభివృద్ధి, సంక్షేమంలో మున్ముందుకు
నివాళులర్పిస్తున్న మంత్రి అజయ్

దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి పువ్వాడ

ఖమ్మం, జూన 2 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధి, సంక్షేమంలో మున్ముందుకు దూసుకుపోతున్నామని, పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్‌లో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. తొలుత ఆయన పెవిలియన్‌ గ్రౌండ్‌ వద్ద అమరవీరుల స్తూపం వద్ద, బైపాస్‌రోడ్‌ ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం వెంకటాయపాలెం సమీపంలోని సమీకృత కలెక్టరేట్‌కు చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సిద్ధించాక తొమ్మిదేళ్ల కేసీఆర్‌ పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలు, పనుల పురోగతిపై ప్రగతి నివేదికను వినిపించారు. కరోన లాంటి విపత్కర, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొని మరీ బలీయమైన ఆర్థికశక్తితో పరిపాలనలో ఆదర్శంగా నిలిచామన్నారు. అన్నీవర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరుగుతోందని, పల్లెలు, పట్టణాలు రూపురేఖలు మారాయని, పంటల సాగులో గణనీయ అభివృద్ధిని సాధించామన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, పాలేరు రిజర్వాయర్‌కు సీతారామ అనుసంధానమైతే జిల్లాలో కరువు పరిస్థితులు ఉండవన్నారు. ఈప్రాజెక్టుతో జిల్లాలో 4.32లక్షల ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరుతుందని, మిషన్‌కాకతీయ, మిషనభగీరఽథతో సాగు, తాగునీటి సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. ధరణి పోర్టల్‌తో భూ వివాదాలు, సమస్యలు పరిష్కారమయ్యాయయని, జీవో 58 ద్వారా 3,253మందికి పట్టాలు అందించామని, 59ద్వారా 2,559మంది దరఖాస్తులు ఆమోదించామని, 202 దరఖాస్తుల రిజిస్ర్టేషన పూర్తయిందన్నారు. వ్యవసాయానికి 24గంటలు ఉచిత విద్యుత అందుతోందని, జిల్లాలో 2014లో 75 విద్యుత సబ్‌స్టేషన్లు ఉండగా ఇప్పుడు 49సబ్‌స్టేషన్లు పెరిగాయన్నారు. వైద్యశాఖపరంగా ఖమ్మానికి మెడికల్‌ కాలేజీ మంజూరైందని, వందసీట్లతో ఈవిద్యాసంవత్సరం తరగతులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. 9బస్తీదవాఖానాలు, 161 పల్లెదవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. కంటి వెలుగుతో రెండువిడతల్లో పేదలకు ఉచింతంగా నేత్రల పరీక్షలు చేసి 1.77లక్షలమందికి అద్దాలు అందించామన్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 5,796మంది మహిళలకు వైద్య పరీక్షలు, కేసీఆర్‌ న్యూట్రిషన కిట్‌, ఆరోగ్యశ్రీ పథకాలు, మనఊరు మనబడి, మనబస్తీ మనబడి కింద జిల్లాలో రూ.178కోట్లతో పాఠశాలల్లో వసతులు కల్పించామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 1,36,663మందికి జాబ్‌కార్డులు అందించామని, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం కింద 2015-16నుంచి ఇప్పటి వరకు 8,956 ఇళ్లు మంజూరవగా.. 5,626 ఇళ్లు పూర్తిచేసి 5,442 ఇళ్లను లబ్ధిదారులకు అందించామన్నారు. దళితబంధు కింద చింతకాని మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికచేసి 3262 మంది లబ్దిదారులకు రూ.346.20కోట్లు, జిల్లా వ్యాప్తంగా 3,945 కుటుంబాలకు రూ.394.50కోట్లు మంజూరుచేశామన్నారు. ఫీజురీయింబర్సుమెంట్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, క్రీడాప్రాంగణాల అభివృద్ధికి, రహదారుల అభివృద్ధికి రూ.వేలాది కోట్లు నిధులు వెచ్చించామన్నారు. రవాణాశాఖ ద్వారా జిల్లాలో రూ.147.60కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించామని, భూగర్భ గనులశాఖ ద్వారా ఖనిజ అక్రమ తవ్వకాలు నియంత్రించగలిగామని, దేవాదాయశాఖ ద్వారా జిల్లాలో 40దేవాలయాలు పునర్నిర్మాణం జరిగిందని, 168 మంది అర్చకులకు వేతనాలు అందిస్తున్నామన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల పెంపకం, మొక్కలు నాటడం, వన్యప్రాణుల సంరక్షణ, ఊట చెరువుల అభివృద్ధి, పోలీసుశాఖ ఆధ్వర్యంలో శాంతిభద్రత పరిరక్షణ, సీసీ కెమెరా నిఘా వ్యవస్థను మెరుగుపరిచామన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం మెగాజాబ్‌మేళా ఏర్పాటుచేసి 8200మందికి ఉపాధి కల్పించామన్నారు. ఖమ్మంలో గోళ్లపాడు ఛానల్‌, లకారం ట్యాంక్‌బండ్‌ అభివృద్ధి, తీగల వంతెన, రహదారుల్లో సెంట్రల్‌ లైటింగ్‌, కొత్తబస్టాండ్‌, నగర పాలక సంస్థకు కొత్త భవనం నిర్మించడంతో వైరా, మధిర, సత్తుపల్లి పురపాలక సంఘాల ద్వారా మౌళిక సదుపాయాలను కల్పించామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100కోట్లు కార్ఫస్‌ఫండ్‌ కేటాయింపు, రూ.15కోట్లతో హైదరాబాద్‌లో మీడియా అకాడమీ భవనం నిర్మిస్తున్నామని, ఖమ్మం జర్నలిస్టులకు రూ.23.02ఎకరాల్లో ఇళ్లస్థలాలు ఇవ్వబోతున్నామన్నారు. ఇక 21రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌,సీపీ విష్ణుఎస్‌వారియర్‌, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, జడ్పీచైర్మన లింగాల కమల్‌రాజ్‌, ఎమ్మెల్సీతాతా మధుసూదన, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు,మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన బచ్చు విజయ్‌కుమార్‌, రైతుబంధు జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, నగర పాలకసంస్థ కమిషనర్‌ ఆదర్శసురభి, అదనపు కలెక్టర్లు మధుసూదన, స్నేహలతమొగిలి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయంలో పురోగతి జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన విప్‌ రేగా కాంతారావు కొత్తగూడెం కలెక్టరేట్‌, జూన 2: తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయంలో దూసుకుపోతున్నామని, రైతుబంధు సాయం, రైతుబీమా పథకాలతో రైతులకు అండగా ఉంటున్నామమని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తొలుత కొత్తగూడెం, ఇల్లెందు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పీ డాక్టర్‌ వినీతతో కలిసి ప్రగతిమైదానంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం రేగాకాంతారావు సమీకృత కలెక్టరేట్‌కు చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తొమ్మిదేళ్ల ప్రగతిని వివరించారు. నూనె గింజల పంటల సాగుకు ఇస్తున్న ప్రోత్సాహంతో జిల్లా రైతులు ఉద్యాన, పామాయిల్‌, కోకోసాగులో ఆదర్శంగా నిలిచారన్నారు. ధరణితో భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతోందని, సీతారామా ఎత్తిపోతల పథకంతో పుష్కలంగా ఉన్న గోదావరి నీటిని వృథా అవనీయకుండా సాగునీటిగా మళ్లించుకోనున్నామన్నారు. ఈ ప్రాజెక్టుతో 6.74లక్షల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయన్నారు. రూ.13.58కోట్లతో పంపుహౌస్‌ పనులు పూర్తయ్యాయని, కాలువ పనలు95శాతం పూర్తి చేశామని, సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్‌ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. దళితబంధు ద్వారా జిల్లా 421 మందికి రూ 42.10కోట్లు మంజూరు చేశామన్నారు. మిషనభగీరఽథ కింద ఐదు ఇన్‌టేక్‌ వెల్స్‌ నుంచి 87 పంపుహౌస్‌లు. 47ఓవర్‌హెడ్‌ ట్యాంకుల ద్వారా 1,455 ఆవాసాలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. అలాగే 5,626 డబుల్‌ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తికాగా ఇప్పటి వరకు 2,965 ఇళ్లకు లబ్ధిదారును ఎంపిక చేశామన్నారు. అలాగే సుదీర్ఘ సమస్యగా మారిన పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 50,595 మందికి పోడు హక్కు పత్రాలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు ప్రధర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన దిండిగల రాజేందర్‌, కొత్తగూడెం మున్సిపల్‌ చైర్మన కాపు సీతాలక్ష్మి, అదనపు కలెక్టర్‌ కె వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:16:25+05:30 IST