బలవర్థకం.. రుచికరం

ABN , First Publish Date - 2023-09-27T00:00:10+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయడంతో పాటు.. వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే చిన్నారుల ఆరోగ్యపరిరక్షణే ధ్యేయంగా పౌష్టికాహారం అందిస్తున్న విద్యాశాఖ రాగి జావ, సన్నబియ్యంతో మధ్యాహ్నభోజనాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో అడుగు ముందుకు వేసి దసరా కానుకగా వచ్చేనె

 బలవర్థకం.. రుచికరం

దసరా నుంచి సర్కారు బడుల్లో ‘చీఫ్‌ మినిస్టర్స్‌ బ్రేక్‌ఫాస్ట్‌’

ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులకు అల్పాహారం అందజేత

ఖమ్మం జిల్లాలో సుమారు లక్ష మంది చిన్నారులకు లబ్థి

ఖమ్మం ఖానాపురం హవేలీ, సెప్టెంబరు 26 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయడంతో పాటు.. వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే చిన్నారుల ఆరోగ్యపరిరక్షణే ధ్యేయంగా పౌష్టికాహారం అందిస్తున్న విద్యాశాఖ రాగి జావ, సన్నబియ్యంతో మధ్యాహ్నభోజనాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో అడుగు ముందుకు వేసి దసరా కానుకగా వచ్చేనెల 24న ముఖ్యమంత్రి అల్పాహార పథకం (చీఫ్‌మినిస్టర్స్‌ బ్రేక్‌ఫాస్ట్‌ స్కీం)ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 24న విజయదశమి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించి ఉదయం వేళల్లో రాగిజావ, మధ్యాహ్న భోజన సమయానికి మధ్యలో ఈ అల్పాహారాన్ని అందించనున్నారు. ప్రైవేటుకు దీటుగా.. ‘మన ఊరు మనబడి.. మన బస్తీ మన బడి’ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సౌకర్యాలు, మెరుగైన వసతులను కల్పించడంతో పాటు కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు దీటుగా విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే చదువుతున్నందున వారికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోడ్సులు, ఏకరూపదుస్తులు అందిస్తున్న ప్రభుత్వం.. పేద కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారికి మరింత అండగా నిలిచేందుకు విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువుపట్ల ఏకాగ్రత పెంచే దిశగా చర్యలు చేపట్టింది. ఉదయాన్నే వ్యవసాయ, ఇతర కూలీ పనులు చేసుకొని జీవించే పేద, నిరుపేద కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రుల ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్‌ దసరా నుంచి విద్యార్థులకు అల్పాహారం అందించే పథకానికి రూపకల్పన చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ క్షేత్రస్థాయిలో సీఎం అల్పాహార పథకాన్ని అమలు చేేసందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని 1,288 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో లక్ష మందికి పైగా విద్యార్థులకు ప్రభుత్వం ఇప్పటికే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నది. దసరా నుంచి అల్పాహారం కూడా అందనుంది. తద్వారా 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదీ అల్పాహార మెనూ.. దసరా నుంచి విద్యార్థులకు అందించే అల్పాహార మెనూను ప్రభుత్వం ప్రకటించింది. ఉప్మా, పొంగల్‌, కేసరి, కిచిడీ లాంటి వాటితో పాటు వాటిలోకి పల్లి చట్నీ, సాంబార్‌ను అందించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అందిస్తున్న రాగిజావ, కోడిగుడ్ల పంపిణీని కూడా కొనసాగిస్తూనే.. రాగిజావ, మధ్యాహ్నభోజన సమయానికి మధ్య ఈ అల్లాహారాన్ని అందించాలని ప్రభుత్వం సూచించింది.

Updated Date - 2023-09-27T00:00:10+05:30 IST