షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి భేటీ

ABN , First Publish Date - 2023-01-24T23:45:06+05:30 IST

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. సోమవారం జరిగిన ఇల్లెందు ఆత్మీయ సమ్మేళనంలో ‘ఏ గూటి పక్షులు ఆగూటికే చేరుతాయి’ అని వ్యాఖ్యచేసిన పొంగులేటి.. మరుసటిరోజే షర్మిలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి భేటీ

ఖమ్మం, జనవరి 24 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. సోమవారం జరిగిన ఇల్లెందు ఆత్మీయ సమ్మేళనంలో ‘ఏ గూటి పక్షులు ఆగూటికే చేరుతాయి’ అని వ్యాఖ్యచేసిన పొంగులేటి.. మరుసటిరోజే షర్మిలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే బీఆర్‌ఎస్‌ను వీడబోతున్న పొంగులేటి బీజేపీలో చేరుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఆయన పార్టీ మార్పుపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, బీజేపీలో చేరతారా? కాంగ్రెస్‌లో చేరాతారా? అన్న ఊహాగానాల మధ్య పొంగులేటి షర్మిలతో బేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పాలేరు నుంచి పోటీ చేయబోతున్నట్టు షర్మిల ఇప్పటికే ప్రకటించగా.. ఈ భేటీ క్రమంలో పొంగులేటి షర్మిలకు మద్దతు ప్రకటి ంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-01-24T23:45:06+05:30 IST