ఓటుహక్కు నమోదుకు ముగిసిన గడువు

ABN , First Publish Date - 2023-09-19T23:38:46+05:30 IST

జిల్లాలో ఓటుహక్కు నమోదుకు గడువు ముగిసింది. మంగళవారం నాటికి ఓటునమోదు కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ముగించారు. 2023 అక్టోబరు 1నాటికి 18ఏళ్లు నిండిన యువతీయువకులకు ఓటుహక్కును కల్పించేందుకు ఇప్పటి వరకు దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్ర వ్యా

   ఓటుహక్కు నమోదుకు  ముగిసిన గడువు

ఖమ్మం జిల్లాలో 64వేల 618 క్లెయింలు

ఇప్పటి వరకు 17వేల541 పరిష్కారం

తుది ఓటర్ల జాబితా అక్టోబరు 4న విడుదల

ఖమ్మం కలెక్టరేట్‌, సెప్టెంబరు 19: జిల్లాలో ఓటుహక్కు నమోదుకు గడువు ముగిసింది. మంగళవారం నాటికి ఓటునమోదు కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ముగించారు. 2023 అక్టోబరు 1నాటికి 18ఏళ్లు నిండిన యువతీయువకులకు ఓటుహక్కును కల్పించేందుకు ఇప్పటి వరకు దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఆగస్టు 26,27, సెప్టెంబరులో 2, 3వ తేదీల్లోప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో నాలుగు రోజుల పాటు అన్ని నియోజకవర్గంలో ప్రతి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. దీనితో పాటు ప్రతి నిత్యం బీఎల్వోలు ఇంటింటికీ సర్వే నిర్వహించి వలస వెళ్లిన ఓటర్లు, మృతిచెందిన ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాలు మారిన వారు, నియోజకవర్గాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. జిల్లా లోని తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, బీఎల్వోలు ఓటర్ల నమోదుతో పాటు 6, 7, 8ఫారాల్లో ఓటర్లనుంచి దరఖాస్తులను స్వీకరించారు. వీటిని క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి అప్‌లోడ్‌ చేస్తున్నారు. అక్టోబరు 1నాటికి పూర్తిస్థాయిలో ఓటర్ల వివరాలను సేకరించి అక్టోబరు 4న తుదిజాబితాను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మంగళవారం వరకు ఐదు నియోజకవర్గాల్లో 64వేల 618 దరఖాస్తులు అందాయి. వీటిలో ఇప్పటి వరకు 17వేల541 దరఖాస్తులు ఆనలైన చేశారు. ఇంకా 47వేల 077 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాల్సి ఉంది.

Updated Date - 2023-09-19T23:38:46+05:30 IST