ప్రతీపేదకు సంక్షేమపథకాలు అందాలి
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:58 PM
ప్రతీ పేదకు సంక్షేమ పథకాలు అందేలా పనిచేయాలని, ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రజా పాలన గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖలు, ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజాపాలన కార్యక్రమ అమలుపై మంగళవారం వారు ఖమ్మం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గురువారం నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనున్నట్టు అన్నారు. పేదల ఆశలు నెరవేర్చే దిశగా, ప్రతీ పేదవ్యక్తికి సంక్షేమ పథకాలు అందజేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నా
ఆరుగ్యారంటీల పకడ్బందీ అమలుకు ప్రజాపాలన గ్రామసభలు
ఇరుజిల్లాల అధికారులతో సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి
ఖమ్మం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ప్రతీ పేదకు సంక్షేమ పథకాలు అందేలా పనిచేయాలని, ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రజా పాలన గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖలు, ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజాపాలన కార్యక్రమ అమలుపై మంగళవారం వారు ఖమ్మం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గురువారం నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనున్నట్టు అన్నారు. పేదల ఆశలు నెరవేర్చే దిశగా, ప్రతీ పేదవ్యక్తికి సంక్షేమ పథకాలు అందజేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రతీ దరఖాస్తుకు సానుకూలంగా స్పందించి పరిష్కార చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తేవాలన్నారు. పదేళ్లలో రాష్ట్రంలో పేదవారికి ఇల్లు, రేషన్, ఆరోగ్యశ్రీ, ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని, ప్రజాపాలనలో గ్రామసభలు చేపట్టి, సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరించాలన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఎంతో మంది మహిళలకు ఉపయుక్తంగా ఉందని, రాజీవ్ ఆరోగ్యశ్రీని పరిమితి పెంచి అమలు చేస్తున్నామని, 100రోజుల్లోపే హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పేదలు, గిరిజనులు ఎక్కువగా ఉంటారని, బాధ్యతగా, సంయమనం, సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, ప్రజాపాలనపై అధికారులు స్పష్టతతో విజయవంతం చేయాలన్నారు. మంచిగా పనిచేేస్త ప్రజలకు మంచి జరుగుతుందని, ప్రభుత్వానికి అధికారులు రెండు కళ్లని, ప్రభుత్వం పథకాలు తెస్తే.. వాటిని అమలు చేసేది అధికారులేనన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. గురువారం నుంచి జనవరి 6 వరకు పని దినాల్లో జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీలోని ప్రతీ వార్డుల్లో సభ నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. గ్రామసభల షెడ్యూల్ ముందస్తుగా తెలియజేయాలని, ప్రణాళికాబద్ధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామసభల వద్ద ప్రతీ 100 మందికి ఒక కౌంటర్, నీడ కోసం షామియానా, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పన చేయాలన్నారు. సిబ్బందికి ప్రజాపాలన సభ నిర్వహణకు సంబంధించిన ప్రతీఅంశంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. అధికారులు సమష్టిగా కృషి చేేస్త ఫలితం ఉంటుందన్నారు. కార్యక్రమంలో భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, ఖమ్మం స్థానికసంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ భద్రాద్రి జిల్లాలోని 22 మండలాల్లో 481 గ్రామ పంచాయతీలు, 4 మునిసిపాలిటీల్లో 114 వార్డులు ఉన్నాయని, ఖమ్మం జిల్లాలో 21 మండలాల్లో 589 గ్రామ పంచాయతీలు, 4 మునిసిపాలిటీల్లో 125 వార్డులు ఉన్నట్లు తెలిపారు. 59 బృదాలు ఏర్పాటు చేసి, రోజుకు రెండు షిఫ్టుల్లో జనాభాకు అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ, ప్రజా పాలన సభలకు బందోబస్తు చేపట్టనున్నట్టు, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్‌సింగ్, భద్రాద్రి అదనపు కలెక్టర్లు డా.రాంబాబు, మధుసూదన్ రాజు, ఉమ్మడి జిల్లాకు వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.