దివ్యాంగులకు సమాన హక్కు కల్పించాలి

ABN , First Publish Date - 2023-02-21T23:16:39+05:30 IST

దివ్యాంగులకు సమాజంలో సమాన హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు.

దివ్యాంగులకు సమాన హక్కు కల్పించాలి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

కొత్తగూడెం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 21: దివ్యాంగులకు సమాజంలో సమాన హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల హక్కులు, సంక్షేమంపై కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఐడీఓసీ కార్యాలయపు గేటు నుంచి కార్యాలయం వరకు వచ్చేందుకు దివ్యాంగుల ఇబ్బందులను గుర్తించిన కలెక్టర్‌ ఉచితంగా బ్యాటరీ ఆపరేటేడ్‌ వాహనం ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సదరం దృవీకరణ పత్రాలు జారీ కోసం నమోదు చేసుకొన్న 700 మంది దివ్యాంగులకు సదరం దృవీకరణ పత్రాలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకొంటమన్నారు. మండలాల వారిగా జాబితా సిద్దం చేయాలని డీఆర్‌డీఓను ఆదేశించారు. రెండు పడక గదులు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలు, జడ్పీ ద్వారా వచ్చే నిధుల్లో 5శాతం కేటాయించే విధంగా చర్యలు తీసుకొంటామన్నారు. ఉపాధిహామి పనుల్లో దివ్యాంగులకు అనుకూలమైన పనులు కల్పించేందుకు చర్యలు తీసుకొంటామని సర్క్యులర్‌ జారీ చేస్తామన్నారు. ఆసరా పించన్లు మంజూ రు చేయాలని 120 మంది టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేశారని వాటిలో 110 మందికి పరిష్కరించామన్నారు. మిగిలిన 10మంది సమస్య పరిష్కరించేందుకు చ ర్యలు తీసుకొంటామన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లేనీనా, డీఆర్‌డీఓ ఽమధుసూధన్‌రాజు, జడ్పీ సీఈఓ విద్యాలత, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, బీసీ సంక్షేమ అధికారి సంజీవరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శిరీష, కమిటీ సభ్యులు సతీష్‌, సాయిరం పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:16:43+05:30 IST