వివాదంగా మారిన విగ్రహం
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:53 PM
రఘునాథపాలెం మండలంలో బయలపడిన విగ్రహం వివాదస్పదంగా మారింది.. గ్రామంలో రెండు వర్గాల గొడవకుదారి తీసింది. చివరకు గ్రామంలోని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యక్తిని పోలీసుస్టేషన్‌కి పిలిపించి పోలీసులు విచారణ ప్రారంభించారు. స్థానికుల కథనం మేరకు.. కోయచెలకకు చెందిన ఓ వ్యక్తి తనకు దేవుడు కలలో కనిపించాడని, పువ్వాడ ఉదయ్‌నగర్‌లో గుట్టమీద దేవుడు ఉన్నాడని చెప్పాడు.
రఘునాథపాలెం,డిసెంబరు26: రఘునాథపాలెం మండలంలో బయలపడిన విగ్రహం వివాదస్పదంగా మారింది.. గ్రామంలో రెండు వర్గాల గొడవకుదారి తీసింది. చివరకు గ్రామంలోని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యక్తిని పోలీసుస్టేషన్‌కి పిలిపించి పోలీసులు విచారణ ప్రారంభించారు. స్థానికుల కథనం మేరకు.. కోయచెలకకు చెందిన ఓ వ్యక్తి తనకు దేవుడు కలలో కనిపించాడని, పువ్వాడ ఉదయ్‌నగర్‌లో గుట్టమీద దేవుడు ఉన్నాడని చెప్పాడు. మంగళవారం పువ్వాడ ఉదయ్‌నగర్ రెండు పడకల ఇళ్ల సమీపంలో భూమిని కొద్దిగా తవ్వారు. దీంతో అక్కడ దేవుడి విగ్రహం కనిపించింది. దేవుడు వెలిచాడని పూజలు చేయాలని హడావిడి ప్రారంభమైంది. అయితే విగ్రహం బయటపడిన తీరుపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కొద్దిపాటి నెలను తవ్వితే విగ్రహం బయటపడటం, పురాతన విగ్రహం రూపం లేకపోవటంతో ఇరుపక్షాలు గొడవకు దిగటంతో రఘునాథపాలెం సీఐ శ్రీధర్ విచారణ చేపట్టారు. ప్రభుత్వం భూమి కావటంతో ఆస్థలాన్ని దేవాలయం పేరుతో నిర్మాణం చేసేందుకు విగ్రహం పెట్టారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.