భధ్రాద్రి రామయ్యకు రూ.కోటితో వాహనాలు

ABN , First Publish Date - 2023-01-24T22:40:25+05:30 IST

భద్రాద్రి రామయ్యకు వివిధ సేవల్లో ఉపయోగించేందుకు పలు వాహనాలను ఎన్నారై వాసవీ అసోసియేషన్‌ ఆర్ధిక సహకారం తో తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణంలో తయారు చేస్తున్నారు.

భధ్రాద్రి రామయ్యకు రూ.కోటితో వాహనాలు
వివరాలు తెలుసుకుంటున్న ఈవో శివాజి

భద్రాచలం, జనవరి 24: భద్రాద్రి రామయ్యకు వివిధ సేవల్లో ఉపయోగించేందుకు పలు వాహనాలను ఎన్నారై వాసవీ అసోసియేషన్‌ ఆర్ధిక సహకారం తో తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణంలో తయారు చేస్తున్నారు. రూ.కోటి వ్యయం అంచనాతో పలు వాహనాలను రాగితో తయారు చేస్తున్న వీటిని ఫిబ్రవ రి చివరి వారం వరకు భద్రాచలం చేరేలా తయారు చేస్తున్నారు. అశ్వ, గజ, హంస, శేష, గరుఢ, హనుమత్‌, కల్పవృక్షం, సార్వభౌమ, సూర్యప్రభ, చంద్రప్రభ, సింహాసనం తదితర వాహనాలు ఉన్నాయి. వీటిని మంగళవారం భద్రాచలం దేవస్థానం ఈవో బి.శివాజీతో కూడిన వైదిక బృందం సభ్యులు కుంభకోణం వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాలకు సంబంధించి పలు మార్పు లను సూచించారు. ఈ వాహనాలను రామయ్యకు వివిధ సేవల నిమిత్తం విని యోగించనున్నారు.

Updated Date - 2023-01-24T22:40:25+05:30 IST