నేటి నుంచి నూతన సువర్ణ ద్వాదశ వాహన.. ప్రతిష్ఠా మహోత్సవం

ABN , First Publish Date - 2023-03-01T22:29:13+05:30 IST

భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నూతన సువర్ణ ద్వాదశ దివ్య వాహన ప్రతిష్టా మహోత్సవా లకు గురువారం అంకురార్పణ చేయనున్నారు.

నేటి నుంచి నూతన సువర్ణ ద్వాదశ వాహన.. ప్రతిష్ఠా మహోత్సవం

భద్రాచలం, మార్చి 1: భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నూతన సువర్ణ ద్వాదశ దివ్య వాహన ప్రతిష్టా మహోత్సవా లకు గురువారం అంకురార్పణ చేయనున్నారు. మూడున సువర్ణ ద్వాదశ దివ్య వాహన ప్రతిష్ట, సాయంత్రం 12 బంగారు వాహనాలతో స్వామి వా రికి తిరువీధి సేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 4వ తేదీన సాయంత్రం సార్వభౌమ వాహన సేవను నిర్వహించనున్నారు. యుఎస్‌ఏకు చెందిన ప్రవాసాంధ్ర వాసవీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూ.75 లక్షలతో 12 వాహనాలను తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణంలో తయారు చేయించారు. వీటికి సంప్రదాయబద్దంగా గురువారం నుంచి ప్రతిష్టా మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో సార్వభౌమ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, సింహాసనం, హంస వాహనం, సింహ, గజ, అశ్వ, చంద్రప్రభ, సూర్యప్రభ, గరుఢ, శేష వాహనాలు ఉన్నాయి. మూడు శతాబ్దాల తరువాత భద్రాద్రి రామయ్యకు 12 వాహనాలు సమకూరడంతో ఇక నుంచి స్వామి వారికి ఈ వాహనాల్లోనే తిరువీధి, ఇతర ప్రత్యేక సేవలు నిర్వహించనున్నారు.

Updated Date - 2023-03-01T22:29:13+05:30 IST