అంబరాన్నంటిన దశాబ్ది సంబురం

ABN , First Publish Date - 2023-06-02T23:18:30+05:30 IST

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఇరుజిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వేడుకలు ఘనంగా జరగ్గా ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరైన జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. తొలి, మలి దశ ఉద్యమాల్లో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌గౌతమ్‌, సీపీ వారియర్‌, తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొనగా సాంస్కృ

 అంబరాన్నంటిన దశాబ్ది సంబురం

ఇరు జిల్లాల్లో ఘనంగా రాష్ట్ర అవరతణ వేడుకలు

పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) / కొత్తగూడెం కలెక్టరేట్‌/ ఖమ్మం సాంస్కృతికం, జూన 2: రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఇరుజిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వేడుకలు ఘనంగా జరగ్గా ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరైన జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. తొలి, మలి దశ ఉద్యమాల్లో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌గౌతమ్‌, సీపీ వారియర్‌, తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొనగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాయంత్రం లకారం ట్యాంక్‌బండ్‌లో నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. సత్తుపల్లిలో మునిసిపల్‌ చైర్మన్‌ సహా పలువురు అధికారులు, నేతలు, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్‌, మధిరలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు. భద్రాద్రి కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, జిల్లాలోని ఎమ్మెల్యేలు తమతమ క్యాంపు కార్యాలయాల్లో జాతీయ జండాను ఎగురవేసి సంబరాలు నిర్వహించారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఇల్లెందులో బానోత హరిప్రియ నాయక్‌ తన క్యాంపు కార్యాలయంలో, మున్సిపల్‌ చైర్మన దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మున్సిపల్‌ కార్యాలయంలో జండాను ఎగురవేశారు. మాజీ మున్సిపల్‌ చైర్మన, వైస్‌ చైర్మన మడత రమ, వెంకటగౌడ్‌ దంపతులు ఆవిర్భావ ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించారు. సోనియాగాంధీ, కేసీఆర్‌ చిత్రపటాల మధ్య జాతీయజండా ఎగురవేశారు. అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరరావు, దమ్మపేట మండలం అంకంపాలెంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరరావు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతీ వైభవం గొప్పది మనదైన ఆట పాట ప్రత్యేకతలతో కూడిన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయ కళారూపాలు గొప్పవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి నగరంలోని సీక్వెల్‌ ట్యాంకు బండ్‌ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఆటపాట, బొట్టుబోనాల్లో తెలంగాణ సంస్కృతి మిళితమై ఉండటం గర్వకారణమన్నారు.. ఈసందర్భంగా పలు కళా బృందాలకు చెందిన కళాకారులు, ప్రదర్శించిన సాంస్కృతిక అంశాలు ఆద్యంతం అలరించాయి.. జిల్లా సాంస్కృతిక శాఖ కళాకారులు, ఇతర పలు రంగాలకు చెందిన కళాకారులు పాల్గొని ప్రదర్శణలిచ్చారు. శాస్త్రీయ, జానపద, డప్పునృత్యాలు, కోలాటాలు, తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలు, ఆటపాట ఘనత చాటి చెప్పే కళా ప్రదర్శణలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌, నగర మేయర్‌ పునుకొల్లునీరజ, సుడా చైర్మన బచ్చు విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:18:30+05:30 IST