తెలంగాణ ఉద్యమానికి ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి
ABN , First Publish Date - 2023-09-27T00:09:32+05:30 IST
తెలంగాణ సాయుధ పోరాటానికి చిట్యాల (చాకలి)ఐలమ్మ చేసిన ఉద్యమమే నాంది అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆమె పోరాటమే స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి మంగళవారం మంత్రి పూలమాలలు వేసి నివాళులు
అభివృద్ధిని అడ్డుకోవాలని చూసినా పట్టుబట్టి ఐటీహబ్ తెచ్చా
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మంకార్పొరేషన, సెప్టెంబరు 26: తెలంగాణ సాయుధ పోరాటానికి చిట్యాల (చాకలి)ఐలమ్మ చేసిన ఉద్యమమే నాంది అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆమె పోరాటమే స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి మంగళవారం మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వం అఽధికారికంగా నిర్వహించిన జయంతోత్సవంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ నిజాం, దేశముఖ్‌ల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. ఆమె చేసిన పోరాటం తెలంగాణ ఉద్యమానికి నాంది కావటమే కాకుండా మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్పూర్తిగా నిలిచిందన్నారు. ఒకవైపు సాయుధపోరాటం చేస్తూనే ఉద్యమకారులకు అన్నంపెట్టిన మహనీయురాలు ఐలమ్మ అని కీర్తించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ వీరనారి ఐలమ్మ మహిళలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. చాకలి ఐలమ్మ పేరుతో ఒక పథకం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతానని వద్దిరాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ వీపీ.గౌతమ్, రాష్ట్ర విత్తనాభివృద్ధిసంస్థ ఛైర్మన కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, అదనపు డీసీపీ కేఆర్‌కే. ప్రసాదరావు, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి జ్యోతి, సమైక్య రజకసంఘం నాయకులు రేగళ్ల కొండలు, తంగెళ్లపల్లి శ్రీనివాస్, బీసీసంఘం నాయకులు డాక్టర్.పాపారావు, పగడాల నాగరాజు, పద్మశాలిసంఘం రాష్ట్రనాయకులు బొమ్మ రాజేశ్వరరావు, బీసీఫ్రంట్ నాయకురాలు శ్రీలక్ష్మి, లింగబోయిన పుల్లారావు, రజకసంఘం నాయకులు తెనాలి వీరబాబు, బొడ్డు ఉపేందర్, కణతాల నర్సింహారావు, బీసీ సంఘాలు, వివిధ కులసంఘాల నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూసినా పట్టుబట్టి ఐటీహబ్ తెచ్చా కొందరు మహానుభావులు ఖమ్మం నగరానికి ఐటీహబ్ రాకుండా అడ్డుపడినా పట్టుబట్టి ఐటీహబ్‌ను తీసుకొచ్చానని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. నగరంలోని 11వ డివిజన కవిరాజ్‌నగర్‌లో కవిరాజ్‌నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నూతలపాటి నాగేశ్వరరావు, కార్పొరేటర్ సరిపూడి రమాదేవి సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మంత్రి కేటీఆర్ ఏదో ఒక నెలలో ఖమ్మం వస్తున్నారని, వచ్చిన ప్రతిసారి రూ.1,000కోట్ల అభివృద్థి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నారు. 30వ తేదీన మళ్లీ కేటీఆర్ పర్యటన ఉందని, అప్పుడు కూడా రూ.1,300కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుందని, కేటీఆర్ ఖమ్మం వస్తూనే ఉంటారన్నారని, తానూ ఖమ్మంను వదిలే ప్రసక్తే లేదన్నారు. తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు హయాంలో అంకురార్పణ జరిగిన సర్దార్‌పటేల్ స్టేడియాన్ని అభివృద్ధి చేసే అవకాశం తనకు దక్కిందన్నారు. నగరంలో పేదలు నివశించే ప్రాంతాలను అద్భుతంగా తయారుచేశామన్నారు. ఖమ్మం జనాభా ఇప్పటికే 4లక్షలు దాటిందని, భవిష్యతలో 10లక్షలకు చేరి మిలీనియం సిటీ అవుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఐదేళ్లలో ఊహించనంత అభివృద్ధి చేస్తానని మంత్రి పువ్వాడ హామీ ఇచ్చారు.