33.8 శాతానికే ప్రథమ స్థానమా?

ABN , First Publish Date - 2023-06-02T23:14:14+05:30 IST

‘మన ఊరు మన బడి’ లెక్కల్లో ఈ వింతలతో జనం విస్తుపోతున్నారు. పనుల్లో పురోగతి పావు శాతం కూడా దాటకుండానే ఉన్నతాధికారులు జిల్లాలకు వెయిటేజీ, ర్యాంకులను ప్రకటిస్తుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మన ఊరు మన బడి పనుల్లో 33.8శాతం పనులు పూర్తిచేసిన ఖమ్మంజిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. మరి మిగతా 76శాతం ప

 33.8 శాతానికే ప్రథమ స్థానమా?
ఖానాపురం బాలాజీనగర్ లో అదనపు గదుల పనులు

‘మన ఊరు మన బడి’ లెక్కల్లో వింతలు

ఖమ్మం కంటే మిగతా జిల్లాల్లో అంతకన్నా తక్కువ వెయిటేజీ

ఖమ్మం ఖానాపురం హవేలీ, జూన 2: ‘మన ఊరు మన బడి’ లెక్కల్లో ఈ వింతలతో జనం విస్తుపోతున్నారు. పనుల్లో పురోగతి పావు శాతం కూడా దాటకుండానే ఉన్నతాధికారులు జిల్లాలకు వెయిటేజీ, ర్యాంకులను ప్రకటిస్తుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మన ఊరు మన బడి పనుల్లో 33.8శాతం పనులు పూర్తిచేసిన ఖమ్మంజిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. మరి మిగతా 76శాతం పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియడం లేదని, అసలు పనులు పూర్తికాకుండా ఇలా ర్యాంకులు ప్రకటించడం, పైగా ఖమ్మం జిల్లా కంటే పలు జిల్లాలు దిగువన ఉండటం ఏంటో అర్థం కావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు. మరో వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలల్లో జరుగుతున్న అబివృద్ధి పనులు అసౌకర్యంగా మారే అవకాశం ఉందని, పలు పాఠశాలల ఆవరణలు ఇసుక, కంకర, ఇనుము తదితర నిర్మాణ సామగ్రితో ఉన్నాయని చెబుతున్నారు. పాయింట్లతో ర్యాంకులట.. వందశాతం పనులు పూర్తి కాకపోయినా ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే నెంబర్‌వన ర్యాంకును సాధించినట్లు అధికారులు ప్రకటించారు. నెంబర్‌ వన రావడం గర్వకారణమే అయినా పూర్తిగా పనులు చేయకుండా గొప్పలు చాటుకోవడమేంటని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రచారార్భాటంపై పెడుతున్న శ్రద్ధ.. పనుల పూర్తిపై చూపడం లేదన్నవిమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మంలో మొత్తం 426 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో కేవలం 73పాఠశాలల్లో పనులు పూర్తిచేశారు. ఆయా బడుల్లో 2,396 పనులు ప్రారంభించి 1268 పూర్తి చేశారు. వీటికి గాను రూ.76.3కోట్లు మంజూరవగా రూ.35.53కోట్ల పనులకు ఎంబీ చేయించారు. అయితే ప్రారంభించిన పనుల సంఖ్య, పూర్తిచేసిన వాటి సంఖ్య, ఎంబీ చేయించిన పనుల సంఖ్య ప్రాతిపదికన జిల్లాకు అధిక పాయింట్లు దక్కగా కాగితాలపై లెక్కల్లో మొదటి స్థానం దక్కింది. అదే లెక్కల ప్రకారం భద్రాద్రి జిల్లాకు ఐదో స్థానం దక్కింది. మొదటి విడతలో పనులే ఇంత ఆలస్యమైతే ఇక రెండో విడత పనులు ప్రారంభించేదెప్పుడోనన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి మెదటి విడతలోని 426 పాఠశాలలోని మొత్తం పనులను ఈ ఏడాది జూన 12 కల్లా పూర్తి చేయాల్సి ఉండగా.. కేవలం 73 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తిచేయగా.. మిగిలిన 353 పాఠశాలల పరిస్థితేంటో తెలియడం లేదు. భద్రాద్రి జిల్లాలో 368 పాఠశాలలకు గాను 35 పాఠశాలలో పనులు పూర్తయ్యాయి. ఇక నల్గొండ జిల్లాలో 516 పాఠశాలలకు గాను కేవలం 35 పాఠశాలలోనే పనులు పూర్తి చేసి 21వ స్ధానం, సంగారెడ్డి జిల్లాలో 440 పాఠశాలలకు గాను 38 పాఠశాలలో పనులు పూర్తి చేసి 8వ స్ధానంలో ఉన్నాయి. అన్నింటికంటే చివరి స్ధానంలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 290 పాఠశాలలకు గాను కేవలం 1 పాఠశాలలో మాత్రమే పనులు పూర్తి చేసుకుని చివరి స్ధానంలో నిలిచింది. మొదటి పది స్థానాలు సాధించిన జిల్లాలు జిల్లా పనుల వెయిటేజీ ర్యాంకు ఖమ్మం 33.80 1 రాజన్న సిరిసిల్ల 32.07 2 ములుగు 26.97 3 మంచిర్యాల 26.55 4 భద్రాద్రి కొత్తగూడెం 26.51 5 సిద్దిపేట 24.36 6 వనపర్తి 24.9 7 సంగారెడ్ది 22.39 8 కరీంనగర్‌ 22.97 9 ఆసీఫాబాద్‌ 22.33 10

Updated Date - 2023-06-02T23:14:14+05:30 IST