11గోశాలలకు 150ట్రాక్టర్ల పశుగ్రాసం

ABN , First Publish Date - 2023-06-01T01:35:27+05:30 IST

ఎండలు మండుతున్న వేళ.. పశుగ్రాసం లేక అలమటిస్తున్న మూగజీవాలకు పశుగ్రాసాన్ని అందించి మూగజీవాల పట్ల ఉన్న ఉదారతను చాటుకున్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.

11గోశాలలకు 150ట్రాక్టర్ల పశుగ్రాసం
ట్రాక్టర్‌ నడుపుతున్న వద్దిరాజు, పక్కన ఎమ్మెల్యే సండ్ర,

DSC_3744.jpgటేకులపల్లి గోశాలలో గోవులకు పండ్లు అందిస్తున్న ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే సండ్ర దంపతులు

అందించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర

కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు తదితరులు

ఖమ్మం కార్పొరేషన్‌, మే 31 : ఎండలు మండుతున్న వేళ.. పశుగ్రాసం లేక అలమటిస్తున్న మూగజీవాలకు పశుగ్రాసాన్ని అందించి మూగజీవాల పట్ల ఉన్న ఉదారతను చాటుకున్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. తన నియోజకవర్గంలోని రైతుల సహకారంతో సేకరించిన 150ట్రాక్టర్‌ ట్రక్కుల ఎండువరిగడ్డిని ఎమ్మెల్యే సండ్ర ఖమ్మంలోని 11గోశాలలకు బుధవారం అందించారు. సత్తుపల్లినుంచి భారీ ర్యాలీగా ఖమ్మం వరకు ట్రాక్టర్లతో వచ్చిన సండ్రకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం అదనపు కలెక్టర్‌ మధుసూదనరావు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం రెండుకిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించగా.. ఎంపీ వద్దిరాజు ట్రాక్టర్‌ నడిపారు. ఆ తర్వాత ఖమ్మం ఖానాపురం గోశాలలో సండ్ర వెంకటవీరయ్య, మహాలక్ష్మి దంపతులతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచ్రంద్ర తదితర నాయకులు ప్రత్యేక పూజలు చేసి.. 11గోశాలలకు పశుగ్రాసాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ అన్నదానం మాదిరిగానే మూగజీవాలకు పశుగ్రాసం అందించడం పుణ్యకార్యమని, గోవులను పవిత్రంగా పూజించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ప్రారంభ సందర్భంలో గోవులకు పశుగ్రాసంపంపిణీ చేశామని, టీడీపీ ఽఅధినేత చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ సభ్యుడిగా అవకాశం వచ్చిందని, అప్పుడు ఖమ్మంలోని గోశాల సందర్శనకు వచ్చినప్పుడు పశుగ్రాసం కోసం పశువులు పడుతున్న బాధలు చూసి బాధేసిందని, అప్పటినుంచి ఏటా జిల్లాలో పశుగ్రాసం అవసరం ఉన్న ప్రతి గోశాలలకు పశుగ్రాసం అందిస్తున్నామన్నారు. రైతులు స్వచ్ఛందంగా గడ్డిని గోవులకోసం అందించడం ఒక బృహత్తర కార్యక్రమని, నోరులేని మూగజీవాల ఆకలి తీర్చడం ఒక మహాసంకల్పంతో కూడుకున్నదన్నారు. గోదావరి వరదల సమయంలో కూడా గ్రాసం కోసం అలమటిస్తున్న భద్రాచలం గోశాలలోని మూగజీవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుమేరకు పశుగ్రాసం అందించామన్నారు. కార్యక్రమంలో భాగస్వాములైన రైతులకు ఎమ్మెల్యే సండ్ర కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంస్‌ ఛైర్మన రాయల శేషగిరిరావు, గ్రంథాలయసంస్థ చైర్మన కొత్తూరు ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T01:35:27+05:30 IST