KCR: ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్‌ఎస్‌ గెలుచుకునే సీట్ల సంఖ్య చెప్పిన కేసీఆర్...

ABN , First Publish Date - 2023-05-17T17:43:47+05:30 IST

సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 9 ఏళ్లలో ఏం చేశామో ప్రజలకు చెప్పాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రైతులను చెరువుల దగ్గరకు పిలిచి మీటింగ్‌లు పెట్టాలని, చెరువుగట్ల మీద రైతులతో కలిసి భోజనం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

KCR: ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్‌ఎస్‌ గెలుచుకునే సీట్ల సంఖ్య చెప్పిన కేసీఆర్...

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌కు (BRS) 105 సీట్లు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై (Karnataka Election Results) స్పందిస్తూ... కర్ణాటక ఫలితాలను పట్టించుకోవద్దని కేడర్‌కు సూచించారు. అక్కడ ఎవరు గెలిచినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ విస్తృత సమావేశం జరిగింది. కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

9 ఏళ్లలో ఏం చేశామో ప్రజలకు చెప్పండి..

9 ఏళ్లలో ఏం చేశామో ప్రజలకు చెప్పాలని బీఆర్‌ఎస్ (BRS) శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రైతులను చెరువుల దగ్గరకు పిలిచి మీటింగ్‌లు పెట్టాలని, చెరువుగట్ల మీద రైతులతో కలిసి భోజనం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, వాళ్లను ప్రజలు నమ్మరని తెలిపారు. మంత్రులు జిల్లాల్లో తెలంగాణ (Telangana) దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.

Updated Date - 2023-05-17T17:55:37+05:30 IST